»   » సెక్స్ సీన్స్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేసానా?, మీరు డైరక్ట్ గా చూసినట్లు మాట్లాడతారేం?

సెక్స్ సీన్స్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేసానా?, మీరు డైరక్ట్ గా చూసినట్లు మాట్లాడతారేం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కళ్యాణ్ రామ్ ఫ్లాఫ్ మూవీ కత్తిలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సనా ఖాన్ గుర్తుందా. ఆ తర్వాత ఆమె సౌత్ లో కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది కానీ. అవేవీ అంతగా వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా వజహ్ తుమ్ హో అనే ఈరోటిక్ థ్రిల్లర్ మూవీతో బాలీవుడ్ ని వేడెక్కించింది. షర్మాన్ జోషీ-సనా ఖాన్ లు నటించిన ఈ సినిమా హిట్టయిందా , ఫ్లాఫ్ అయిందా అనే సంగతి పక్కన పెడితే.. వసూళ్లు బాగానే దక్కాయి.

అయితే ఆ సినిమాలోని బోల్డ్ సీన్స్ లో నటించేటప్పుడు ఆమె పూర్తి గా ఎంజాయ్ చేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ఈ విషయమై ఆమె మండిపడుతోంది. నేను ఆ సీన్స్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసానని మీకు చెప్పానా, లేక మీరు డైరక్ట్ గా చూసారా...ఎందుకలా రాస్తున్నారు,మాట్లాడుతున్నారు అంటోంది.


సనా ఖాన్ మాట్లాడుతూ..."మొదట నేను ఏం అన్నానో గుర్తు చేసుకోండి. సినిమాలో బోల్డ్ సీన్స్ చేయటానికి కథ ప్రకారం డిమాండ్ చేస్తే నటించటానికి ఇబ్బంది పడలేదు అన్నాను. దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. అలాగే బోల్డ్ సీన్స్ చేయటంలో తప్పేమీలేదు.

Sana Khan: I Never Said I 'Enjoy' Doing Bold Scenes!

రేపు నేను ఓ సినిమాలో వయిలంట్ గా ఓ మర్డర్ చేసే పాత్ర చేసాననుకోండి. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా, నేను జనాలను చంపటం ఎంజాయ్ చేస్తానని మీరు అంటారా. నేను ఓ నటిగా ..పాత్రలో లీనమై నటిస్తాను. నటించటాన్ని ఎంజాయ్ చేస్తాను అంతేకానీ నటనలో జీవించను. జీవించినట్లు మీకు అనిపించేలా నటిస్తాను. నాకు ఆ తేడా తెలుసు. ." అంటూ బాలీవుడ్ మీడియాని ఏకేసింది.

అలాగే ఇప్పటి జనరేషన్ కు తగిన విధంగా బ్రాడ్ మైండెడ్ తో సినిమాలను చూస్తే ఎలాంటి సమస్య ఉండదు. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి తప్పుడు కోణంలో చూస్తే తప్పే కనిపిస్తుంది అంటూ సనా ఖాన్ తనదైన వాదన వినిపిస్తోంది.

ఇవన్నీ ప్రక్కన పెడితే సనాఖాన్ ..ఇప్పుడు మళ్లీ ఇలాంటి సినిమానే ఒకటి చేయడానికి ఒప్పుకుంది. 2005లో వచ్చిన టామ్ డిక్ హ్యారీ కి సీక్వెల్ లో నటించేందుకు సనా ఖాన్ అంగీకరించిందని తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన వజహ్ తుమ్ హోను ఎరోటిక్ కేటగిరీలో చేర్చినా.. ఇది మాత్రం డైరెక్టుగా అడల్ట్ కంటెంట్ సినిమానే అని తెలుస్తోంది. అయినా సరే తనకేమీ అబ్జెక్షన్ చెప్పి మరీ.... టామ్ డిక్ హ్యారీ-2లో నటించేందుకు సై అనేసిందట.

English summary
Sana Khan, who was last seen in the film 'Wajah Tum Ho' said, "Firstly, I never said it in that context. There's nothing wrong in doing bold scenes. Tomorrow if I play a murderer in a violent film, you can't go around and say that I love to kill people. As an actor, you enjoy the characters that you play in a movie."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu