»   » మోడీ తీరును తప్పుబడుతు...హాట్ హీరోయిన్ రమ్య ట్వీట్లు

మోడీ తీరును తప్పుబడుతు...హాట్ హీరోయిన్ రమ్య ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రమ్య ఆ తర్వత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ తరుపున ఉప ఎన్నికల్లో పోటీ చేయడం.....తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడి పోవడం తెలిసిందే. ఓటమి తర్వాత కొంత కాలం పాటు ఆమె విదేశాలకు వెళ్లి పోయింది. కొన్ని నెలల క్రితమే తిరిగి ఇండియాకి వచ్చింది. అయితే లైమ్ లైట్ లోకి మాత్రం రావడం లేదు.

తాజాగా రమ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనపై వివాదాస్పద ట్వీట్లు చేయడం ద్వారా వార్తల్లో వ్యక్తిగా మారింది. బీజేపీ గవర్నమెంటు తీరును తప్పుబడుతూ ఆమె వ్యవహార శైలి ఉండటం గమనార్హం. ఇండియన్ యూత్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న ఆమె గతంలో రాహుల్ గాంధీకి పలు విషయాల్లో మద్దతుగా నిలిచారు. అలాంటి వ్యక్తి మోడీపై విమర్శలు చేయడంలో ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని మరికొందరి వాదన.

రాజకీయాల సంగతి పక్కన పెడితే.... ప్రస్తుతం ఆమె మళ్లీ కన్నడ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆమె చివరగా నటించిన చిత్రం శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఆర్యన్ చిత్రంలో. కొంత కాలంగా పాటు ఆమె విదేశాల్లో చదువు కోసం సినిమాలకు దూరంగా ఉన్నారు.

స్లైడ్ షోలో రమ్య మోడీపై చేసిన కామెంట్లు...

మోడీపై రమ్య ట్వీట్

మోడీపై రమ్య ట్వీట్

మేక్ ఇన్ ఇండియా కోసం మేడ్ ఇన్ ఇండియాను నాశనం చేస్తున్నావు. మేడ్ ఇన్ ఇండియాకు రక్షణగా ఉంటే అదే నువ్వు ఈ దేశానికి చెసే పెద్ద మంచి పని.

ఇండియాపై దృష్టి పెట్టు

ఇండియాపై దృష్టి పెట్టు

ఇండియాలో తెలివైన వారు ఉన్నారు, పని చేసే వారున్నారు. అవకాశాలు, నైపుణ్యాలు ఉన్నాయి. మనకు మనం ఎదగగల శక్తి ఉంది. కావాల్సిందల్లా మంచి పాలసీలు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ముందు ఇక్కడ చూడు..బయట దేశాల్లో కాదు.

చైనా వస్తువులు

చైనా వస్తువులు

మీరు చేసే ప్రయత్నం చైనా వస్తువులకు మనదేశంలో దారి సుగమం చేసేలా ఉంది.

మ్యాంగోలు

మ్యాంగోలు

ఇండియన్ మ్యాంగోస్ అమెరికా మార్కెట్లో అమ్మేందుకు అనుమతి లేదు. కానీ ఇక్కడ మాత్రం హార్లే డేవిడ్ సన్ బైకులు అమ్ముతన్నారు. కనీసం రైతులకు ఉపయోగ పడే పనులు చేయ్.

రమ్య

రమ్య

మనకు సొంతగా ప్రొడక్షన్ ఉన్నపుడు దిగుమతి సుంకాన్ని ఎందుకు తగ్గించారు. చైనా తన రైతుల విషయంలో ఇలానే చేస్తోందా?

చైనా చీప్

చైనా చీప్

ఇంపోర్టు డ్యూటీ తగ్గించడం ద్వారా చైనా వస్తువులు ఇండియాలో చాలా చీప్ గా దొరుకుతాయి. దీని వల్ల ఇక్కడి తయారీ దారులకు నష్టం.

రమ్య

రమ్య

చైనా తన దేశంలోని తయారీ దారులకు, ఎగుమతి దారులకు సబ్సిడీలు ఇస్తోంది. అందు వల్లే వారు తమ వస్తువులను ఇతర దేశాల్లోతక్కువ రేటుకు అమ్మగలుగుతున్నారు.

విమర్శలు

విమర్శలు

మీరు చేసే పనులు ధీర్ఘకాలిక కాలంలో దేశంలోని ఉత్తత్తి దారులకు నష్టం కలిగించే విధంగా ఉంది.

Read more about: ramya, modi, rahul gandhi, aryan
English summary
Sandalwood actress is once again back with a bang in social networking site Twitter. This time the glamorous actress has Tweeted PM Modi about his tour to China. Controversial tweets of Ramya against Modi Government has just come to the spotlight and the Tweets reveal, Ramya dislike for BJP Government. The ac
Please Wait while comments are loading...