For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమిళంలో మాట్లాడి ఇరుక్కున్న హీరోయిన్

  By Srikanya
  |
  బెంగళూరు : తరచూ ఏదో ఇక వివాదంలో చిక్కుకొనే సినీ నటి రమ్య మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఆమె స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌, శాంతినగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆంగ్ల, తమిళ భాషలో ప్రసంగించడం ఈ వివాదానికి కారణమైంది.

  ప్రెస్‌క్లబ్‌లో ఆమె ఎక్కువ శాతం ఆంగ్లంలో ప్రసంగించడం, శాంతినగర్‌లో తమిళంలో మాట్లాడుతూ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడంతో కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయమై పలువురు కన్నడ భాషా సంఘాల ప్రముఖులు రమ్యను తాను ఎక్కడ ప్రచారం చేస్తానో అక్కడి వారి భాషా ప్రాధాన్యతను బట్టి ప్రసంగించడంలో తప్పు లేదని మాధ్యమాలకు సమాధానమిచ్చారు.

  తనకు భాషా స్వాతంత్య్రం ఉందని, ఈ విషయంలో ఎవరి నిర్బంధాలతో తనకు పని లేదని కూడా ట్విట్టర్‌లో రమ్య సమర్థించుకున్నారు. అందాల నటి రమ్య ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఎక్కడ తన అవసరముంటే అక్కడ వాలిపోతున్నారు. ఈ యువజన కాంగ్రెస్‌ నాయకురాలు మీడియాలో మనసులోని మాటలను వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు రాజకీయాలు పునరావాసం కావని రమ్య అన్నారు.

  రమ్య మాటల్లోనే... 'నేను పుడుతూనే బంగారు చెంచాతో పుట్టలేదు. నన్ను చదివించేందుకు మా అమ్మ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. మూడేళ్లు బోర్డింగ్‌ స్కూల్‌ చదివాక, సెయింట్‌ జోసప్‌ పాఠశాలలో చేరాను. కొన్ని కారణాల వల్ల చదువు పూర్తి చేయలేదు. ఈ సందర్భంలో నా మిత్రులు ఐశ్వర్య రాయ్‌, సుస్మితాసేన్‌ చిత్రాలను చూసి వారంతటిదానిని కావాలనుకున్నా. 12ఏళ్ల క్రితం అభి సినిమా ద్వారా చిత్రరంగంలో అడుగుపెట్టాను'.

  'పదేళ్లుగా నేను సినీ పరిశ్రమలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న నేను అదృష్టవంతురాలిని. ఎందరో ప్రతిభావంతులైన నటీమణులున్నా నాకు ప్రతిభతో పాటు అదృష్టం కలిసొచ్చింది. మూడేళ్ల తర్వాత సినిమాల నుంచి విరమించుకుంటా. సౌందర్య, మాలాశ్రీల సుదీర్ఘ కెరీర్‌లను చూసి ఆ స్ఫూర్తితో నటిస్తున్నాను. రాజ్‌కుమార్‌ కుటుంబం ప్రోత్సాహం ఎంతో ఉంది అని చెప్పుకొచ్చింది.

  English summary
  Bangalore-born Ramya, a popular Sandalwoon star who is also known as Divya Spandana, was born to family from Mandya. She had her schooling in Ooty and Chennai, and hence is well-conversant in Tamil. Besides, she has acted in Tamil movies. On Wednesday, she went on a road show campaigning in favour of Nalapad Ahmed Haris, sitting Congress MLA seeking re-election from Shantinagar constituency in the city. Ramya has been known to land in controversies because of her attitudes and occasional tantrums. She, at the request of Haris, while addressing the audience, spoke in Tamil. Some Kannada enthusiasts immediately posted angry comments on her Twitter account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X