»   » హీరోయిన్ చెంప దెబ్బలు కొట్టింది:సందీప్‌కిషన్‌

హీరోయిన్ చెంప దెబ్బలు కొట్టింది:సందీప్‌కిషన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ''ఇప్పటివరకూ అన్ని చిత్రాల్లో ఓ నటుడిగానే కనిపించాను. తొలిసారి హీరోగా చేశాను. ఇందులో నన్ను నిషా చెంప దెబ్బలు కొట్టింది. ఏకంగా ఏడుసార్లు'' హీరో సందీప్‌కిషన్‌ అన్నారు. ఆయన తాజా చిత్రం 'డీకే బోస్‌' గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.


సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న 'డీకే బోస్' పాటలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. ర్యాండమ్ థాట్స్ పతాకంపై శేషురెడ్డి, ఆనంద్ రంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్. బోస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అచ్చు సంగీత స్వరాలు అందించారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన పోలీస్‌ అధికారి ప్రేమలోపడ్డాక ఎలా మారాడన్నదే కథ. కథ చెప్పిన వెంటనే సందీప్‌ అంగీకరించారు. అచ్చు సంగీతం కథకు బలాన్నిస్తుంది. సందీప్, నిషా అంకిత భావంతో తమ పాత్రల్ని చాలా బాగా చేశారు. 'పడిపోయా' పాటని అచ్చు పదిహేను నిమిషాల్లో కంపోజ్ చేశాడు''అన్నారు.

తాను నటిస్తున్న మొదటి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'బోస్ డీకే' అనీ, డైరెక్టర్ బోస్ చాలా క్రియేటివ్‌గా చిత్రాన్ని రూపొందించాడనీ హీరో సందీప్ కిషన్ తెలిపారు. తన బాణీలకు శ్రీమణి, వనమాలి చక్కని సాహిత్యాన్ని అందించారని అచ్చు అన్నారు.

ప్రతిభని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోటే ఈ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్నామనీ, ఈ చిత్రం తప్పక ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందనీ నిర్మాతల్లో ఒకరైన శేషురెడ్డి చెప్పారు.

English summary
Sundeep Kishan starrer DK Bose film is directed by debutant A N Bose and Director Anand Ranga and Sesh Reddy are producing the film jointly. The film features Nisha Agarwal is pairing up with Sundeep Kishan for the first time in this youthful entertainer.
Please Wait while comments are loading...