twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు జరిగిన మాట నిజమే: సందీప్ కిషన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రారా కృష్ణయ్య విషయంలో ఓ తప్పు జరిగింది. అది 'తేరే నాల్‌మే ప్యార్‌ హోగయా'కి కాపీ సినిమా అనుకొన్నారు. కానీ ఈ రెండు సినిమాలూ హాలీవుడ్‌ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొనే రూపొందించినవి. వాస్తవానికి హాలీవుడ్‌ సినిమా ‘లైఫ్‌లెస్‌ ఆర్డినరీ' ప్రేరణతో ‘రారా కృష్ణయ్య' కథ రాశానని డైరెక్టర్‌ మహేశ్‌ చెప్పాడు. అప్పటికే అదే సినిమా స్ఫూర్తితో బాలీవుడ్‌లో ‘తేరే నాళ్‌ లవ్‌ హో గయా' (రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా హీరో హీరోయిన్లు) తీశారని మాకు తెలీదు. ‘రారా కృష్ణయ్య' 60 శాతం షూటింగ్‌ చేశాక ఆ సినిమాను యథాలాపంగా చూసి, ఆశ్చర్యపోయాం.

    కానీ మా వంతు ప్రయత్నం మేం నిజాయతీగా చేశాం. ఓ ఇరవై నిమిషాల నిడివి తగ్గిస్తే.. మంచి ఫలితం ఉండేది. మా సినిమా రిలీజయ్యాక వాళ్లు మా నిర్మాతల మీద లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామన్నారు. కానీ ఒకే సినిమా స్ఫూర్తితోటే రెండు సినిమాలూ వచ్చాయి కాబట్టి ఏం చెయ్యలేకపోయారు. ఏమైనా ‘రారా కృష్ణయ్య' నిర్మాత సేఫ్‌ అయ్యారు. ఒక్క ఓవర్సీస్‌ డిసి్ట్రబ్యూటర్‌కు మాత్రమే నష్టాలు వచ్చాయి. దాంతో వూపిరి పీల్చుకొన్నా అన్నాడు సందీప్ కిషన్.

    కీర్తి ఫిలిమ్స్‌ పతాకంపై అశోక్‌, నాగార్జున్‌ సంయుక్తంగా నిర్మించిన ‘జోరు' చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటించారు. కుమార్‌ నాగేంద్ర దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారుసందీప్‌.

    Sandeep kishan about Ra Ra Krishnayya Movie

    జోరు గురించి చెప్తూ...

    డైరెక్టర్‌ కుమార్‌ నాగేంద్రతో ఇది నాకు రెండో చిత్రం. ఇదివరకు ఆయనతో ‘గుండెల్లో గోదారి' చేశాను. అది చేసే టైమ్‌లోనే మళ్లీ కలిసి పనిచేయాలని ఇద్దరమూ అనుకున్నాం. ఆ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. అయితే అందులో వినోదం పాలు తక్కువగా ఉందని ప్రేక్షకులు భావించారు. అందుకని ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రం చెయ్యాలని అనుకున్నాం. అలాగే ‘జోరు' చేశాం. కుమార్‌ చాలా బాగా సినిమాను రూపొందించాడు.

    ఇది చాలా సింపుల్‌ స్టోరీ. నా పాత్ర పేరు సందీప్‌. విశేషమేమంటే ఇందులోని ముగ్గురు హీరోయిన్లు ‘అన్నపూర్ణ' అనే ఒకే పాత్ర చెయ్యడం. అలాగే నాకు ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. అంటే కన్ఫ్యూజన్‌ కామెడీ అన్నమాట. హీరోయిన్లుగా రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ చేశారు. ఆ ముగ్గురితో నాకో మంచి మాస్‌ సాంగ్‌ ఉంది. చిరంజీవిగారి పాటల స్ఫూర్తితో ఆ పాటను కంపోజ్‌ చేశారు. మొదటిసారి బ్రహ్మానందం కాంబినేషన్‌లో నటించా. మా ఇద్దరి కెమిసీ్ట్ర బాగా కుదిరింది.

    ఆయన పాత్రపేరు ‘పీకే'. అంటే ‘పెళ్లికొడుకు'. మేం ఎప్పుడు కలిసినా ఆయనా, నేను పౌరాణిక భాషలో మాట్లాడుతుంటాం. ఎలుగుబంటి కామెడీతో సప్తగిరి కూడా బాగా నవ్విస్తాడు. దర్శకుడు రాసుకున్న పాత్రలకు తగ్గ పాత్రధారులు లభించారు. ఇప్పటిదాకా నేను టెన్షన్‌ పడే పాత్రలు చేశా. మొదటిసారి ఎదుటివాళ్లను టెన్షన్‌ పెట్టే పాత్రను ఇందులో చేశా అన్నారు.

    English summary
    Sandeep Kishan said he is happy with his latest Joru Movie going to be released on this Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X