Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మి ‘బుడుగు’ ట్రైలర్
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'బుడుగు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదారాబాద్ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్‌లు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు.
తల్లితండ్రులు తమ పిల్లలపై ఆశలు ఏవో ఆశలు పెట్టుకుంటే సామర్య్థానికి మించిన ఒత్తిడికి లోనయి ఆ పిల్లలు ఎలా తయారు అవుతారు. అలాంటి పరిస్థితి ఎదురైన ఒక పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలతో అతని కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది, ఆ సమస్యల నుండి వారు ఎలా బయట పడ్డారు అనేది ఈ చిత్రం ముఖ్య కథ.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఒక పిల్లాడి చుట్టూ జరిగిన కథతో థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందించారు. రచయిత, దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ...'ఇలాంటి కథ ఇంతకు ముందు రాలేదని చెప్పవచ్చు. నాకు తెలిసిన ఒక సంఘటన ఆధారంగా, పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి, అనేక మంది సైకాలజిస్టులతో చర్చించి తయారు చేసుకున్న కథ అన్నారు. ఇద్దరు పిల్లలు, వారి తలితండ్రులు ఆ చిన్న కుటుంబం మధ్య పట్టుసడలని డ్రామా ఉంటుందని దర్శకుడు చెపుతున్నాడు. ఇందులో లక్ష్మీతో పాటు శ్రీధర్ రావు, ప్రేమ్ భాబు, మరికొన్ని ముఖ్య పాత్రల్లో బేబీ డాలి, సన, ఇందు, ఆనంద్, శైలజ, వాణి నటిస్తున్నారు.

త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈచిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: శ్యాం మేంగా, కళా దర్శకత్వం: ఏ.రాం, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ పుల్లూరి, నిర్మాతల భాస్కర్ మరియు సారిక శ్రీనివాస్. రచన, దర్శకత్వం: మన్మోహన్.