»   »  కనకంగా సంగీత

కనకంగా సంగీత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sangeeta
'ఖడ్గం' తో వెలుగులోకి వచ్చి వరసగా చిన్నా పెద్ద హీరోలందరి సినిమాలలో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సొగసరి సంగీత. 'శివపుత్రుడు' చేసిన తరువాత నటనకు ఆస్కారమున్న సినిమాలు ఎంపిక చేసుకుని తమిళంలో చేస్తూండటంతో తెలుగు తెరకు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ 'కనకం' (24 క్యారెట్స్‌ గోల్డ్‌) అనే చిత్రం ద్వారా తిరిగి టాలీవుడ్ లోకి వస్తోంది. ఈ సినిమా కథ ఓ సామాజిక సమస్యను ఎలివేట్ చేస్తూ పూర్తిగా ఆమె చుట్టూ తిరుగుతూంటుందిట. దాంతో ఆమెకు ఆ పాత్రం బాగా నచ్చి ఒప్పుకుందిట. అందులోనూ ఈ చిత్రం తమిళ, తెలుగు రెండు భాషల్లో ఒకే సారి నిర్మితమవుతుంది.

ఈ సినిమా షూటింగ్‌ నిన్న (ఆదివారం) సారథి స్టూడియోస్‌లో మొదలైంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌నిచ్చారు. అరుణోదయ మూవీ మేకర్స్‌ పతాకంపై శ్రీ ప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో వచ్చే మరో ప్రధాన పాత్రను తమిళంలో పార్తీబన్‌ చేస్తున్నారని, ఆ పాత్రను తెలుగులో ఓ ప్రముఖ హీరో చేయబోతున్నారని ఆయన అన్నారు. ఇతర పాత్రల్లో కె.విశ్వనాథ్‌, సుహాసిని, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, సుమన్‌ శెట్టి, విజయ్‌కుమార్‌, శ్రీరామ్‌, బాలు మహేంద్ర, శ్రీనివాసరెడ్డి తదితరులు కనిపిస్తారు.అంటే సంగీత రీ ఎంట్రీ గ్రాండ్ గానే జరుగుతోందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X