»   » సానియా మీర్జా బాలీవుడ్ ఎంట్రీ!? ఫర్హాన్ అక్తర్ నోరు జారాడా?

సానియా మీర్జా బాలీవుడ్ ఎంట్రీ!? ఫర్హాన్ అక్తర్ నోరు జారాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోర్ట్ లోనే కాదు ఫోటో షూట్ లోనూ ఆకట్టుకునే ఈ బ్యూటీ, ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనలతో ఆకట్టుకుంటోందిసానియా మీర్జా. అదే బాటలో వెండితెర మీద కూడా సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తుందట. ఈ విషయం పై అధికారిక ప్రకటన లేకపోయినా.. సానియా తెరంగేట్రంపై బాలీవుడ్ ఫిలిం మేకర్ ఫర్ఫాన్ అక్తర్ హింట్ ఇచ్చాడు.

ఈ 30 ఏళ్ల హైదరాబాదీ భామ, తన తండ్రితో కలిసి ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందని తెలిపాడు. సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఫర్ఫాన్ ఈ ప్రకటన చేశారు. ఫర్ఫాన్ ట్వీట్ పై స్పందించిన సానియా మీర్జా, కృతజ్ఞతలు తెలియజేసింది.

Sania Mirza is going to shine on the silver screen for a Bollywood film ?

టెన్నిస్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ సినిమాలేనని కథనాలు కూడా వస్తున్నాయి. గతం లో కూడా ఒకసారి ఇలాంటి ప్రశ్నలకు సానియా సమాధానం ఇచ్చింది.. "బాలీవుడ్ సినిమాల్లో నటించాలని నాకు ఆసక్తి ఉంది. నాలో నటించే సత్తా కూడా ఉంది. కానీ ఎప్పుడు నటిస్తానో చెప్పలేను.

Sania Mirza is going to shine on the silver screen for a Bollywood film ?

ఆటలతో పాటు సమయం దొరికనప్పుడు సినిమాలు కూడా ఎక్కువగా చూస్తుంటాను. కానీ ఎప్పుడు సినిమాను కెరీర్ గా అనుకోలేదు. నా ఆటో బయోగ్రఫీని తెరకెక్కించాలనుకుంటే అందులో నేనే నటించాల్సిన అవసరం లేదు. ఆ కథకు ఎవరు సరిపోతారో వాళ్లే నటించవచ్చు" అని చెప్పింది ఈ టెన్నీస్ భామ.

English summary
Tennis star Sania Mirza is going to shine on the silver screen for a Bollywood film soon. Bollywood filmmaker Farhan Akhtar said that the 30-year-old tennis player will soon be seen in a film along with her father. He did reveal more details regarding the project but the movie is touted to be a message oriented.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu