»   » టెన్నిస్ స్టార్ సానియా జీవితంపై సినిమా

టెన్నిస్ స్టార్ సానియా జీవితంపై సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్లో ఎన్నో విజయాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా మారింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రఖ్యాత ఖేల్ రత్న అవార్డు కూడా ప్రకటించింది. క్రికెట్ తప్ప టెన్నిస్ గురించి పెద్దగా పట్టించుకోని ఇండియాలో ఆమె విజయాల కారణంగా యువత ఇటు వైపు ఆకర్షించేలా చేసింది.

టెన్నిస్ స్టార్ సానియా కెరీర్లో ఎదిగిన తీరు...విజయాలు సాధించడానికి ఆమె పడిన కష్టం త్వరలో వెండి తెరపై ఆశిష్కరించబడబోతోంది. సానియా జీవిత కథను సినిమాగా తీయడానికి బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫరా ఖాన్ ఈ విషయమై సానియాను కలిసి ఆమె నుండి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈవిషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

సానియా మీర్జా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమా సెట్స్ మీదనకు వెళ్లనుంది. ఈ సినిమాలో సానియా గురించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని ఆసక్తికర విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

Sania Mirza Life Story Becomes a Movie

ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయబోతున్నారు. సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు నటిస్తారు, ముఖ్యంగా భర్త పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాలు త్వరలో ఖరారు కానున్నాయి.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సానియా మీర్జా మాట్లాడుతూ... తాను ప్రైవేట్ పర్సన్ అని, తన వ్యక్తిగత జీవితంలోని విషయాలు షేర్ చేసుకోవడం ఇస్టం లేదు, తన జీవితంపై సినిమా రావడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఒక వేళ తనపై సినిమా వస్తే తన పాత్రలో దీపిక పదుకోన్ చేస్తే బావుంటుందని పేర్కొంది. మరి ఇంతలోనే సానియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

English summary
Film Nagar source said that, Sania Mirza Life Story Becomes a Movie.
Please Wait while comments are loading...