»   » కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్ (ఫోటో)

కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సంజన గుర్తుందా? ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించినా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేక పోయింది. అయితే సినిమా ఫంక్షన్లు, ఫోటో షూట్లు, వివాదాలతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.

బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. కొన్ని చిన్న చిత్రాల్లో మాత్రం నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానె టైం, సరదా, అవును 2 చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలో రెబల్, బెంగులూరు 23, మళయాలంలో ఓ సినిమా చేస్తోంది.

Sanjana Drinking Kallu

తాజాగా సంజన ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. సంజన కల్లు (తాటి, ఈత చెట్టు నుండి తీసేది) తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆమె కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది. సహజ సిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి హెల్త్‌కి మంచిదే అని తన సన్నిహితులతో చెబుతోందట.

English summary
Sanjana Drinking Kallu. Meanwhile a picture of Sanjana uis doing rounds on web and Sanjana is seen drinking kallu (toddy or palm wine) in traditional method.
Please Wait while comments are loading...