»   » స్పాట్ ఫిక్సింగ్ కేసు విషయమై మీడియాతో సంజన...

స్పాట్ ఫిక్సింగ్ కేసు విషయమై మీడియాతో సంజన...

Posted By:
Subscribe to Filmibeat Telugu
బెంగళూరు : స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయిన రాజస్థాన్ రాయల్స్ టీం సభ్యుడు శ్రీశాంత్ స్నేహితురాలు, కన్నడ నటి సంజనను విచారణ చేయడానికి ముంబయి పోలీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. శ్రీశాంత్‌తో పాటు సంజన పలు పార్టీల్లో కనపడటంతో ఆమెను విచారణ చేసి మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

ఈ విషయంపై సంజన ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.... తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తనను ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు విచారణ చేయలేదని, కనీసం ఫోన్‌లో కూడా సంప్రదించలేదని వివరించారు.


ఇక 2009లో గోవాలో జరిగిన ఒక పార్టీలో శ్రీశాంత్‌తో కలిసి సంజన దర్శనం ఇచ్చింది. ఆ సందర్భంలో శ్రీశాంత్‌తో సంజన కలిసి ఉన్న వీడియో క్లిప్పింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా నిర్వహించిన అన్ని పార్టీలలో శ్రీశాంత్‌తో కలిసి సంజన పాల్గొంది. సంజనతో పాటు శ్రీశాంత్‌తో పరిచయం ఉన్న మరో ఇద్దరు నటీమణులు శ్వేతా శ్రీవాస్తవా, లక్ష్మి రైలనూ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది.

English summary
Kannada Actress Sanjana getting tension with Sreesanth IPL spot fixing expisode. Police May interagate Sanjana for Srishant Spot fixing Case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu