»   » జైలులో సంచులతో సంజయ్ దత్ తిప్పలు

జైలులో సంచులతో సంజయ్ దత్ తిప్పలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjay Dutt
ముంబయి: పుణేలోని యరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్‌దత్‌ కాగిత సంచుల తయారీలో శిక్షణ పొందుతున్నాడు. అయితే నెలరోజులుగా శిక్షణ పొందుతున్నప్పటికీ ఒక్క బ్యాగు కూడా తయారు చేయలేదని తెలిసింది. బ్యాగుల తయారీ ఎంతో సులభమని, సంజయ్‌ త్వరగా ఈపనిలో నైపుణ్యం సాధిస్తారని జైలు అధికారులు భావించారు.

సంజయ్ దత్‌కు శిక్షణ ఇచ్చే నిమిత్తం ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. ఇందులో నైపుణ్యం సాధిస్తే సంజయ్‌ దత్‌కు రోజుకు రూ.25 నుంచి రూ.40 సంపాదిస్తారని జైలు సూపరింటెండెంట్‌ యోగేశ్‌ దేశాయ్‌ తెలిపారు. మొదట్లో జైలు వంటశాల పనిని ఆయనకు అప్పగించాలని అధికారులు భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా మార్పులు చేశారు.

పేపర్‌ బైండింగ్‌, ఫైళ్ల తయారీ పనిని దత్‌ చేయాల్సి ఉంటుందని మరో అధికారి తెలిపారు. సంజయ్‌ దత్‌కు గత రెండు మూడు రోజులుగా ఇంటి ఆహారం రావడం లేదని అధికారులు తెలిపారు. అందుకే ప్రస్తుతం జైలు ఆహారమే అందజేస్తున్నామన్నారు. సంజయ్‌దత్‌ ఇంటి ఆహారం తీసుకునేందుకు టాడా కోర్టు అనుమతించిన విషయం విదితమే.

ఇత సంజూ దాదా గత నెల 16వ తేది నుండి జైలు జీవితం గడుపుతున్నాడు. ఇతను ప్రస్తుతం పుణేలోని ఎరవాడ జైలులో ఉన్నాడు. జైలులో ఉన్న సంజయ్ తన జైలు అనుభవాలను పొందుపర్చి మాన్యతకు రోజుకో లేఖను పంపిస్తున్నాడు. దానికి మాన్యత కూడా మరుసటి రోజు సమాధానం ఇస్తూ మరో లేఖను రాస్తున్నారట.

కాగా, 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి. ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు.

English summary
Actor Sanjay Dutt, who is lodged in Yerawada jail, has not been able to make a single paper bag in the last 40 days. Dutt surrendered on May 16 to serve his rest of the 42-month sentence after his conviction in the 1993 Mumbai serial blasts case. He has been assigned to make paper bags but the jail officials said he was a slow learner. Since making paper bags is considered easy, the jail officials were hopeful that the actor would learn the skill soon. But, they added that the actor is finding it difficult to give finishing touch to the bags.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu