»   » తిండి మానేసిన సంజయ్ దత్, జైల్లోనే కుమిలిపోతూ...

తిండి మానేసిన సంజయ్ దత్, జైల్లోనే కుమిలిపోతూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా సంజయ్ దత్ తనలో తానే కుమిలి పోతున్నాడట. కనీసం ఆహారం కూడా ముట్టుకోవడం లేదని తెలుస్తోంది. దుఖ: సాగరంలో మునిగి పోయిన సంజయ్ దత్ ను చూడలేక పోతున్నామని తోటి ఖైదీలు అంటున్నట్లు సమాచారం.

సంజయ్ దత్ ఇంత బాధలో ఉండటానికి కారణం తన మేనత్త రాణి బాలి మరణించడమేనని తెలిస్తోంది. సంజయ్ దత్‌కు చిన్నప్పటి నుంచి తన మేనత్తతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. దీంతో, ఆమె మరణాన్ని సంజయ్ తట్టుకోలేకపోతున్నారు. మేనత్త అంత్యక్రియలకు హాజరుకావాలని సంజయ్ కోరినప్పటికీ, జైలు అధికారులు ఆయనకు అనుమతి ఇవ్వలేదని సమాచారం.

 Sanjay Dutt goes hungry for two days

సంజయ్ దత్ కేసు విషయానికొస్తే..
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం సంజయ్ దత్ 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

English summary
Sanjay Dutt hasn't eaten anything since two days. Dutt was disturbed when he received the news that his aunt i.e. Sunil Dutt’s sister, Rani Bali passed away. Dutt wanted to attend the funeral but since there was no permission, he in mourning gave up eating.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu