»   » సినిమా షూటింగులో గాయపడ్డ స్టార్ హీరో

సినిమా షూటింగులో గాయపడ్డ స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సినిమా షూటింగులో గాయపడ్డారు. ప్రస్తుతం అతడు ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో 'భూమి' సినిమా చేస్తున్నారు. షూటింగులో భాగంగా యాక్షన్ సీన్ చేస్తుండగా సంజయ్ దత్ గాయపడ్డారు.

గాయపడ్డ తర్వాత పెయిన్ కిల్లర్ వాడి షూటింగ్ కొనసాగించినప్పటికీ నొప్పి తీవ్రం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పక్కటెముక చిన్నగా ప్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. నొప్పి నుండి కోలుకునే వరకు షూటింగుకు దూరంగా ఉండాలని సూచించారు.

 భూమి

భూమి

జైలు జీవితం పూర్తి అయిన త‌ర్వాత సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న చిత్రం ‘భూమి'. ఒమంగ్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న భూమి మూవీ నెల రోజుల క్రితం ఆగ్రాలో ప్రారంభ‌మైంది.

సినిమా కాన్సెప్టు

సినిమా కాన్సెప్టు

ఈ సినిమాలో అదితీరావు హైదరి సంజయ్‌దత్ కూతురు పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో భూమి చిత్రం తెరకెక్కుతుంది.

రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?

ఈ సినిమా ఆగస్టు 17, 2017లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్ పనులు చక చకా జరుగుతున్నాయి.

 షూటింగుకు బ్రేక్

షూటింగుకు బ్రేక్

అయితే సంజయ్ దత్ గాయం కారణంగా షూటింగుకు దూరం కావడంతో.... చిత్రీకరణకు బ్రేక్ పడింది.

English summary
Sanjay Dutt, who has been shooting in Chambal for his comeback film Bhoomi, met with a minor accident on the sets of the film recently. According to a Mid Day report, Dutt was filming an action sequence is when he was attacked by a group of goons as a part of the scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu