twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్‌దత్‌ శిక్షతో పరిశ్రమకు ఎంత నష్టం?

    By Srikanya
    |

    ముంబయి : అక్రమంగా ఆయుధాన్ని కలిగివున్న కేసులో సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు 5 సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో ఆయన నటిస్తున్న సినిమాలపై నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల వ్యయం రూ. 250 కోట్లని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. జంజీర్‌, పోలీస్‌గిరీ, మున్నాభాయ్‌ ఛలే ఢిల్లీ ... తదితర సినిమాలు నిర్మాణంలో వున్నట్టు వారు వెల్లడించారు. ఇప్పుడా దర్శక,నిర్మాతలలో ఆందోళన మొదలైంది. తాము రీ షూట్ చేసుకోవాలా లేక ఎలా ఆ పాత్రను ముగించాలో తెలియని సిట్యువేషన్ లో ఉన్నారు.

    ఈ సినిమాల్లో ముఖ్యంగా...

    రాజ్ కుమార్ హిర్వాణి పి.కె. -50% పూర్తైంది

    కె.ఎస్ రవికుమార్ పోలీస్ గిరి - 90% పూర్తైంది.

    రెన్సిల్ డి సెల్వల్ ..అన్ గ్లీ - 30% పూర్తైంది.

    సోనమ్ షా షేర్ - 90% పూర్తైంది.

    రామ్ చరణ్ జంజీర్ - 75% పూర్తైంది.

    సుభాష్ కపూర్ మున్నాభాయ్ ఛలో డిల్లీ : రీసెంట్ గానే ఎనౌన్స్ చేసారు

    సంజయ్‌దత్‌ మాత్రం న్యాయపోరాటం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో చూసిన తర్వాత న్యాయపరమైన అవకాశాల కోసం పరిశీలిస్తామన్నారు. 'న్యాయవ్యవస్థపై నాకిప్పటికీ నమ్మకం ఉంది. నా కుటుంబం నాకు అండగా ఉంది, ఇప్పటికీ దృఢంగా ఉన్నాను' అని పేర్కొన్నారు. సంజయ్‌దత్‌ గురువారం ముంబయి శివారు బాంద్రా పాలిహిల్‌లోని 'ఇంపీరియల్‌ హైట్స్‌' అపార్టుమెంట్‌లోని పదో అంతస్తులోని తన ఇంటికే పరిమితమయ్యారు. తీర్పు అనంతరం ఎస్‌ఎంఎస్‌ ద్వారా మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ న్యాయపరమైన అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

    టాడా కోర్టులో సంజయ్‌దత్‌ కేసుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన న్యాయవాది సతీశ్‌ మానేషిండే మాట్లాడుతూ.. తాను సంజయ్‌దత్‌తో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తున్నట్లు సంజయ్‌ తనతో చెప్పారని వివరించారు. న్యాయపరంగా ముందుకెళ్తామనీ, అయితే, సంజయ్‌ తనకెలాంటి వెసలుబాటు కావాలని కోరతారో తెలియదన్నారు.

    మూడున్నరేళ్ల జైలుశిక్ష వేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంజయ్‌దత్‌ శిరసావహిస్తారనీ, మూడున్నరేళ్ల శిక్షాకాలం మరీ సుదీర్ఘమేమీ కాదన్నారు. తీర్పు విషయంలో తాము ముందునుంచే ఆయనను సిద్ధం చేశామన్నారు. సంజయ్‌దత్‌ దృఢమైన వ్యక్తనీ, తన పోరాటం పోరాటం సాగిస్తారని చెప్పారు. తాము సంజయ్‌ని ఇప్పటికే మానసికంగా సిద్ధం చేశామని, సంజయ్‌ గట్టి మనిషని, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటారని న్యాయవాది తెలిపారు.

    English summary
    
 An estimated amount of 250 crore is riding on actor Sanjay Dutt who has been sentenced to five-years of imprisonment in the final verdict in the 1993 serial bomb blast case. The actor was shooting for Policegiri at Film City in Mumbai until Wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X