»   » జైలు వదిలిన సంజయ్‌ దత్‌...నెల రోజులు ఇంట్లోనే...

జైలు వదిలిన సంజయ్‌ దత్‌...నెల రోజులు ఇంట్లోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjay Dutt
ముంబయి: 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజయ్‌ దత్‌ శనివారం పుణెలోని ఎరవాడ జైలు నుంచి పెరోల్‌పై విడుదలయ్యారు. భార్య మాన్యత అనారోగ్యంతో ఉన్నారంటూ సంజయ్‌ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని పుణె అధికార యంత్రాంగం డిసెంబరు 6న ఆయనకు నెల రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలపై సంజయ్‌ అక్టోబరులోనూ జైలు నుంచి విడుదలయ్యారు. నెల రోజుల తర్వాత తిరిగి కారాగారానికి వెళ్తారు.


శనివారం జైలు నుంచి ముంబయి చేరుకున్న అనంతరం బాంద్రాలోని తన నివాసం వెలుపల సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ- తనకు పెరోల్‌ మంజూరులో ప్రభుత్వ యంత్రాంగం పక్షపాతాన్ని ప్రదర్శించలేదన్నారు. స్వల్ప వ్యవధిలోనే మీరు రెండోసారి జైలు నుంచి బయటకొచ్చారని మీడియావారు పేర్కొనగా- ఇంతకుముందు తాను 'ఫర్లో'పై వచ్చానని, ఇప్పుడు 'పెరోల్‌'పై వచ్చానని, నిబంధనల ప్రకారం ఈ రెండింటికీ తేడా ఉందని ఆయన బదులిచ్చారు.

ఇక గతంలో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. పుణెలోని ఎరవాడ జైలు ఎదుట నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. పుణె డివిజనల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ దేశ్‌ముఖ్‌ శుక్రవారం సంజయ్‌దత్‌కు పెరోల్‌ జారీ చేశారు. దత్‌ ఇంతకుముందు వైద్యపరమైన కారణాలతో నెల రోజులపాటు సెలవుతో జైలు బయటికి వెళ్లి అక్టోబర్‌ 30న తిరిగి జైలుకెళ్లారు. ఈసారి తన భార్య మాన్యత అనారోగ్యాన్ని కారణంగా చూపి పెరోల్‌ కోరారు.

అయితే, మాన్యత ఓ చిత్ర ప్రదర్శనకు, ఓ సెలబ్రిటీ పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు కొన్ని దినపత్రికల్లో ఫొటోలు ప్రచురించడంతో ఆమె అనారోగ్యంపై పలు ప్రశ్నలు తలెత్తి వివాదం రేగింది. దీనితో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్‌పాటిల్‌ సంజయ్‌దత్‌కు ఏ ప్రాతిపదికన పెరోల్‌ ఇచ్చారనే అంశంపై విచారణ జరపాలని ఆదేశించారు. పెరోల్‌కు అనుమతి ఇవ్వడానికి దారితీసిన పత్రాలను పరిశీలిస్తామని ఆర్‌ఆర్‌పాటిల్‌ విలేకరులతో చెప్పారు.

సంజయ్‌దత్‌పట్ల సానుకూలత చూపుతున్నారంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) ఎరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది. నల్లజండాలు ప్రదర్శిస్తూ, పెరోల్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. దత్‌కు పెరోల్‌ ఇచ్చినా, ప్రత్యేక సదుపాయాలు కల్పించినా మహారాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో నిర్వహిస్తామని ఆర్పీఐ ప్రకటించింది. అధికారులు తమకున్న విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ముంబయి వరస పేలుళ్ల కేసులో దోషి పర్వేజ్‌ షేక్‌ న్యాయవాది ఆరోపించారు. పర్వేజ్‌ను కలిసేందుకు తనను అనుమతించడం లేదనీ, సంజయ్‌దత్‌కు మాత్రం పెరోల్‌ ఇచ్చారని విమర్శించారు.

తాజా వివాదం నేపథ్యంలో సంజయ్‌దత్‌ భార్య మాన్యత కాలేయంలో కణతి, గుండె ఆరోగ్య సమస్య ఉన్నట్లు ఆమెను పరీక్షించిన వైద్యుడు పేర్కొన్నారు. మాన్యతకు కాలేయ సమస్యతోపాటు ఛాతీనొప్పి ఉందనీ, బరువు కూడా తగ్గారనీ, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించామనీ, వాటి ఫలితాలు వస్తే శస్త్రచికిత్స అవసరమైనదీ, లేనిదీ చెబుతామని డాక్టర్‌ అజయ్‌ ఛాఘులే తెలిపారు. వారం రోజుల క్రితం ఆమె తనను సంప్రదించారనీ, కొన్ని మందులు రాశానని చెప్పారు. గతంలో ఆమె లీలావతి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు.

English summary
Two weeks after Sanjay Dutt was granted a monthlong parole, the Bollywood actor was on Saturday released from Pune's Yerwada jail. Additional director general of prisons Meeran Borwankar confirmed the development to PTI. Dutt, undergoing remainder of his five-year jail term for possessing illegal firearms, part of a cache of weapons meant to be used during the 1993 blasts, was granted parole on December 6. The 53-year-old had applied for parole citing ill-health of wife Manyata, to Pune divisional commissioner Prabhakar Deshmukh in whom the authority to grant parole is vested.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu