»   » జైల్లో సంజయ్ దత్, లుంగీ డాన్స్! (ఫోటోలు)

జైల్లో సంజయ్ దత్, లుంగీ డాన్స్! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 బొంబాయి పేలుళ్ల సంఘటనలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై ప్రస్తుతం పూణెలోని ఎరవాడ జైల్లో గడుపుతున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా సంజయ్‌దత్‌కు సంబంధించిన జైలు ఫోటోలు బయటకు వచ్చాయి.

నిధుల సేకరణలో భాగంగా ఈ నెల 26న చేపట్టనున్న ఓ డ్రామా కోసం సంజయ్ దత్ సాధన చేస్తున్నట్లు తాజాగా విడుదలైన దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు జాతీయ ఛానల్ దూరదర్శన్‌లో ప్రసారం అయ్యాయి. సంజయ్ దత్ తో పాటు మరో 50 మంది ఖైదీలు ఈ డ్రామాలో యాక్ట్ చేయనున్నారు. ఈ డ్రామాలో సంజయ్ నటించిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' చిత్రంలోని డైలాగులు కూడా ఉండనున్నాయట.

బాల్‌గంగాధర్ థియేటర్లో ఈ నెల 26న ఈ డ్రామా ప్రదర్శన జరుగనుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌తో పాటు, ఆ రాష్ట్ర హోం మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ కూడా హాజరు కానున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ వేదికపై సంజయ్ దత్ లుంగీడాన్స్ కూడా సాంగుకు డాన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

జైల్లో సంజయ్ దత్‌ ఫోటోలను స్లైడ్ షోలో చూడండి...

సంజయ్ దత్ పాత్ర ఏమిటో..?

సంజయ్ దత్ పాత్ర ఏమిటో..?

సంజయ్ దత్ ఈ డ్రామాలో నటిస్తున్నారనే విషయం మాత్రమే తప్ప...ఆయన ఈ నాటకంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనేది తెలియరాలేదు.

డ్రామా చేస్తున్న సంజయ్

డ్రామా చేస్తున్న సంజయ్

జైల్లో డ్రామా రిహార్సల్స్‌కు సంబంధించిన కార్యక్రమంలో సంజయ్ మైక్ పట్టుకుని డైలాగ్ చెబుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

తోటి ఖైదీతో...

తోటి ఖైదీతో...

జైల్లో తోటి ఖైదీదో కలిసి సంజయ్ దత్ న్యూస్ పేపర్ చదువుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. జైలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ఏకైక మార్గం వారికి ఇదే...

ప్రాక్టీస్ టైం

ప్రాక్టీస్ టైం

నాటకానికి సంబంధించిన ప్రాక్టీసులో భాగంగా తోటీ ఖైదీలతో ఉన్న సంజయ్ దత్. నాటకానికి సంబంధించిన విషయాలపై వారు చర్చించుకుంటున్నారు.

కారణం ఇదే...

కారణం ఇదే...

అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

English summary
Sanjay Dutt was snapped as he was spotted rehearsing for a play in the prison. The play will be produced and enacted by 50 inmates which includes Sanjay. This play will take place on September 26 for a fund raiser. The proceeds that are from this event will go towards creating better facilities for the prisoners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu