»   » సంజయ్ దత్ అదరగొట్టాడు... (‘భూమి’ ట్రైలర్)

సంజయ్ దత్ అదరగొట్టాడు... (‘భూమి’ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

భూమి... సంజయ్ దత్ నటించిన బాలీవుడ్ కంబ్యాక్ ఫిల్మ్. జైలు శిక్ష కారణంగా సినిమాలకు దూరమైన సంజయ్ దత్.... శిక్ష ముగిసిన తర్వాత చేస్తున్న తొలి సినిమా. సంజయ్ దత్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'భూమి' చిత్రానికి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో సంజయ్, అదితి తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. పెర్ఫార్మెన్స్ పరంగా సంజయ్ దత్ అదరగొట్టాడు.

ప్రొటెక్టివ్ ఫాదర్

ప్రొటెక్టివ్ ఫాదర్

కూతురును ఎంతగానే ప్రేమించే తండ్రి పాత్రలో కనిపించిన సంజయ్.... కొన్ని సంఘటనల కారణంగా ఇబ్బందుల్లో పడ్డ తన కూతురును కాపాడుకోవడానికి ఏం చేశాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

 సంజ‌య్ ద‌త్ ఈజ్ బ్యాక్

సంజ‌య్ ద‌త్ ఈజ్ బ్యాక్

ఈ ట్రైలర్ చూసిన అభిమానులు సంజ‌య్ ద‌త్ ఈజ్ బ్యాక్ అనేలా ఉందని, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని అంటున్నారు.

ఓమంగ్ కుమార్

ఓమంగ్ కుమార్

మేరీ కోమ్, సర్బజీత్ లాంటి బయోపిక్ చిత్రాలను అద్భుంగా తెరకెక్కించిన ఓమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే ఆయన దర్శకత్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

సెప్టెంబర్ రిలీజ్

దీప్ సింగ్ మరియు భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బేనర్ పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 22, 2017న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Sanjay Dutt's Bhoomi Official Trailer released. Directed by Omung Kumar, the movie will hit the theaters on September 22.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu