»   » సంజయ్‌దత్‌ విడుదల..!

సంజయ్‌దత్‌ విడుదల..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjay Dutt
ముంబయి: నటుడు సంజయ్‌దత్‌ పెరోల్‌పై త్వరలో విడుదల కానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసినట్లు యరవాడ జైలు సూపరింటెండెంట్‌ యోగేశ్‌ దేశాయ్‌ తెలిపారు. సంజయ్‌దత్‌ బంధువు జామీను కోసం రూ.5000 నగదు పూచీకత్తుగా ఇచ్చినట్లు వివరించారు. సంజయ్‌దత్‌ పెరోల్‌ కోసం చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్న అంశాలను ధ్రువీకరించాలని యరవాడ జైలు అధికారులు ముంబయి పోలీసులను కోరారు. ఈ మేరకు ఖార్‌ డివిజిన్‌ ఏసీపీ శివాజీ కొలేకర్‌ విచారణ జరిపి జైలు అధికారులకు నివేదిక అందించారు. తన భార్య మాన్యత గుండె సంబంధత వ్యాధితో బాధపడుతోందన్న కారణంతో సంజయ్‌ దరఖాస్తు చేసుకున్నారు. వైద్య పరీక్షల సమయాన ఆమె వెంట ఉండేందుకు అనుమతించాలని అందులో పేర్కొన్నారు.

ఇక గతంలో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. పుణెలోని ఎరవాడ జైలు ఎదుట నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. పుణె డివిజనల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ దేశ్‌ముఖ్‌ శుక్రవారం సంజయ్‌దత్‌కు పెరోల్‌ జారీ చేశారు. దత్‌ ఇంతకుముందు వైద్యపరమైన కారణాలతో నెల రోజులపాటు సెలవుతో జైలు బయటికి వెళ్లి అక్టోబర్‌ 30న తిరిగి జైలుకెళ్లారు. ఈసారి తన భార్య మాన్యత అనారోగ్యాన్ని కారణంగా చూపి పెరోల్‌ కోరారు.

అయితే, మాన్యత ఓ చిత్ర ప్రదర్శనకు, ఓ సెలబ్రిటీ పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు కొన్ని దినపత్రికల్లో ఫొటోలు ప్రచురించడంతో ఆమె అనారోగ్యంపై పలు ప్రశ్నలు తలెత్తి వివాదం రేగింది. దీనితో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్‌పాటిల్‌ సంజయ్‌దత్‌కు ఏ ప్రాతిపదికన పెరోల్‌ ఇచ్చారనే అంశంపై విచారణ జరపాలని ఆదేశించారు. పెరోల్‌కు అనుమతి ఇవ్వడానికి దారితీసిన పత్రాలను పరిశీలిస్తామని ఆర్‌ఆర్‌పాటిల్‌ విలేకరులతో చెప్పారు.

సంజయ్‌దత్‌పట్ల సానుకూలత చూపుతున్నారంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) ఎరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది. నల్లజండాలు ప్రదర్శిస్తూ, పెరోల్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. దత్‌కు పెరోల్‌ ఇచ్చినా, ప్రత్యేక సదుపాయాలు కల్పించినా మహారాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో నిర్వహిస్తామని ఆర్పీఐ ప్రకటించింది. అధికారులు తమకున్న విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ముంబయి వరస పేలుళ్ల కేసులో దోషి పర్వేజ్‌ షేక్‌ న్యాయవాది ఆరోపించారు. పర్వేజ్‌ను కలిసేందుకు తనను అనుమతించడం లేదనీ, సంజయ్‌దత్‌కు మాత్రం పెరోల్‌ ఇచ్చారని విమర్శించారు.

తాజా వివాదం నేపథ్యంలో సంజయ్‌దత్‌ భార్య మాన్యత కాలేయంలో కణతి, గుండె ఆరోగ్య సమస్య ఉన్నట్లు ఆమెను పరీక్షించిన వైద్యుడు పేర్కొన్నారు. మాన్యతకు కాలేయ సమస్యతోపాటు ఛాతీనొప్పి ఉందనీ, బరువు కూడా తగ్గారనీ, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించామనీ, వాటి ఫలితాలు వస్తే శస్త్రచికిత్స అవసరమైనదీ, లేనిదీ చెబుతామని డాక్టర్‌ అజయ్‌ ఛాఘులే తెలిపారు. వారం రోజుల క్రితం ఆమె తనను సంప్రదించారనీ, కొన్ని మందులు రాశానని చెప్పారు. గతంలో ఆమె లీలావతి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు.

English summary

 Sanjay Dutt was granted a 30-day parole since his wife Manyata Dutt is unwell. Manyata is reportedly suffering from a heart ailment, and also has tumor growth in her liver. Following this, Prabhakar Deshmukh granted parole to Dutt on December 6 after the Mumbai police and state prisons department recommended Sanjay’s release. The latest reports suggest that Dutt is likely to be out only after December 21. Dutt is serving punishment in Yerwada Jail for his involvement in 1993 Mumbai blast case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu