పాటల రచయితగా మారిన ఖల్‌నాయక్.. జైలులో రాసిన..
పాటల రచయితగా కొత్త అవతారం ఎత్తిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాటల రచయిత అవతారం ఎత్తాడు. ముంబై పేలుళ్లు, అక్రమ ఆయుధాల కేసులో పుణే ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో సంజయ్ దత్ కవితలను రాసి వాటిని సలాఖే అనే పేరుతో సంకలనం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కవితలను పాటలుగా మార్చి తోర్బాజ్ చిత్రంలో తెరకెక్కించనున్నారు. గిరీశ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ నటిస్తున్నారు.
సంజయ్ దత్ రాసిన సలాఖే కవితా సంకలనంలోని ఓ మేరి ఆంగన్ కీ చిడియా హై తూ అనే కవిత నిర్మాత రాహుల్ మిత్రాను విశేషంగా ఆకర్షించిందట. దాంతో దానిని తోర్బాజ్ చిత్రంలో పెట్టాలని నిర్ణయించుకొన్నారు. సంజయ్ అనుమతితో ఆ పాటను చిత్రంలో చేర్చారు. తండ్రి, కూతుళ్ల మధ్య ప్రేమను వ్యక్తం చేసే విధంగా ఈ పాట ఉంటుంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారు.

గతంలో ఖూబ్ సూరత్ అనే చిత్రంలో గాయకుడిగా మారారు. ఏయ్ శివానీ అంటూ పాడిన పాట అభిమానుల విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ తర్వాత చల్ మేరే భాయ్ టైటిల్ పాటను, లగే రహో మున్నాభాయ్‌లో సమ్‌జో హో హీ గయా అనే పాటను పాడారు.


Click it and Unblock the Notifications











