‘గుడ్డు’సెల్ కి సంజయ్‌దత్

అండా సెల్‌లో వెలుతురు సరిగ్గా లేదని, తగినంత వాయు ప్రసరణ లేనందున దత్ ఇబ్బంది పడుతున్నారని న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ టాడా కోర్టుకు చెప్పారు. దీనిపై దత్ రాతపూర్వకంగా ఎటువంటి దరఖాస్తు చేయలేదు. కరడుగట్టిన నేరగాళ్లు లేదా ఉగ్రవాద సంబంధిత అభియోగాలపై అరెస్టయిన వారిని ఈ అండా సెల్‌లో ఉంచుతారని మర్చంట్ పేర్కొన్నారు. తాను టాడా చట్టం కింద దోషిని కాదని, అలాగే ఉగ్రవాదిని కూడా కాదని సంజయ్‌దత్ అన్నాడు.
ఈ నెల 16న సంజయ్‌ను ఆర్థర్ రోడ్డు జైలుకు తీసుకురాగానే, అతడిని 'అండా'సెల్‌లో ఉంచామని ఆ అధికారి చెప్పారు. సంజయ్ లొంగిపోయిన తరువాత అతడిని పుణేలోని యెరవాడ జైలుకు తరలిస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగాయి. శిక్షా కాలం పూర్తయ్యే వరకూ సంజయ్‌ను ఏ జైలులో ఉంచాలన్న దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
సంజయ్‌ను ముంబై వెలుపలికి బదిలీ చేయాలా వద్దా అన్న అంశంపై మహారాష్ట్ర అధికారులు ఇంకా చర్చలు సాగిస్తున్నారు. దత్‌ను ముంబై వెలుపలికి తరిలించే విషయమై నిర్ణయించేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని ఆ అధికారి పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో సంజయ్‌ను ఎక్కడికీ బదిలీ చేసే అవకాశాలు లేవని అదనపు డీజీపీ (జైళ్లు) మీరా బోర్వాంకర్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











