»   » 'అరుంధతి' హిందీ రీమేక్ - 'త్రీడీ' డైరక్టర్ ఎవరంటే...

'అరుంధతి' హిందీ రీమేక్ - 'త్రీడీ' డైరక్టర్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఘన విజయం సాధించిన అరుంధతి చిత్రం త్వరలో హిందిలోకి త్రీడీ ఫార్మెట్ లో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడుగా సంజయ్ గద్వీని ఎంపిక చేసినట్లు సమాచారం. యాష్ రాజ్ క్యాంపుకు చెందిన సంజయ్ గద్వీ ...తేరేలియా చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత మేరీ యాద్ కీ షాదీ హై, దూమ్, ధూమ్ సీక్వెల్ ని డైరక్ట్ చేసి పెద్ద డైరక్టర్ గా మారారు. 2008లో చేసిన కిడ్నాప్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవటంతో ఆ తర్వాత ఆయన మరే చిత్రం డైరక్ట్ చేయలేదు. మళ్ళీ అరుంధతి రీమేక్ తో మెగా ఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ధూమ్ 3 కూడా ఆయన స్క్రిప్టు రెడీ చేసుకుని ఉన్నారు. ఐశ్వర్య రాయ్ ని..అరుంధతి పాత్రకు గానూ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ అరుంధతి ఈ చిత్రాన్ని జెమినీ వారు భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం రైట్స్ కోసం బోనీకపూర్ చివరి వరకూ పోటీపడ్డారు. ఇక ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే జెమినీ వారు ఈ చిత్రాన్ని హిందీలో బారీగా ప్లాన్ చేస్తున్నారు. త్రీడిలో అయితే మరింత హారర్ గా మారి నేషనల్ వైడ్ గా మంచి పేరు, డబ్బు తెస్తుందని ఆశించి కొన్నామని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu