twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3D లోకి 'దేవదాస్‌' చిత్రం కన్వర్షన్.. వివరాలు

    By Srikanya
    |

    టైటానిక్ త్రీడి వెర్షన్ వర్కవుట్ కావటంతో ఇప్పుడు ఇండియాలోనూ అందరి దృష్టీ త్రీడి ఫార్మెట్ పై పడింది. తాజాగా షారుఖ్‌ ఖాన్‌ 'దేవదాస్‌'ని త్రీడీలోకి మార్చబోతున్నారు. ఈ చిత్రం అయిదు జాతీయ పురస్కారాలు, పది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్ని దక్కించుకోవడమే కాకుండా కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్య రాయ్‌ హీరోయిన్స్ గా నటించారు. శరత్ చంద్ర రాసిన దేవదాసు కథని అదే కాలానికి వెళ్లి భారీ సెట్స్ తో సంజయ్ లీలా భన్సాలీ తీసి మెప్పించారు. తెలిసిన కథే అయినా ఈ చిత్రం అందరి మన్ననలూ పొంది కలెక్షన్స్ వర్షం కురిపించింది.

    ఇక దేవదాసు త్రీడి వ్యవహాలాలను సునీల్ లల్లూ చూస్తున్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '''దేవదాస్‌' సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఇప్పుడు త్రీడీలోకి మారుస్తున్నాం. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఆ కథను తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చింది.త్రీడీలోనూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మా నమ్మకం'' అన్నారు. ఇది విన్న మరికొంత మంది నిర్మాతలు ఇప్పుడు పదేళ్లనాటి చిత్రాల్ని త్రీడీలో చూపించేందుకు హిందీ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

    ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ...అక్షయ్ కుమార్ తో రౌడీ రాధోడ్ అనే చిత్రం రూపొందిస్తున్నారు. రవితేజ,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన విక్రమార్కుడు చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం క్రితం సంవత్సరం తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యి రీలీజ్ కు రెడీ అవుతోంది. రౌడీ రాధోడ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు.

    ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా గత చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.

    English summary
    Sanjay Leela Bansali has decided to make ‘Devdas’ (2002) into 3D. Bhansali has received critical acclaim for this film in particular, especially after being disparaged by Indian critics when it first released. “This is the tenth year of Devdas and, somehow, the film hasn’t lost its sheen. We’re now going to do a 3D version of the film to commemorate these ten years. When Devdas released, it was slammed by Indian critics for being over-the-top and melodramatic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X