»   »  షూటింగ్ సెట్లో దారుణం: టాప్ డైరెక్టర్‌‌ను కొట్టి, జుట్టుపట్టి లాక్కెళ్లి దాడి

షూటింగ్ సెట్లో దారుణం: టాప్ డైరెక్టర్‌‌ను కొట్టి, జుట్టుపట్టి లాక్కెళ్లి దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జైపూర్: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీపై దాడి జరిగింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'పద్మావతి' షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లోకి ప్రవేశించిన కొందరు ఆందోళన కారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సెట్స్ ను ధ్వంసం చేయడంతో పాటు భన్సాలీని కొట్టి జుట్టుపట్టి లాక్కెల్లారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ కోటలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Sanjay Leela Bhansali

రాజ్ పుత్ వంశానికి చెందిన రాణి పద్మిణిని అవమాన పరిచే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ... రాజ్ పుత్ కర్ణి సేన సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో షూటింగ్ ఆగిపోవడంతో పాటు సెట్స్ లో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది.

'పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సంగ్ నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.

పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్‌గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.

English summary
Filmmaker Sanjay Leela Bhansali was attacked and the sets of his film "Padmavati" at a fort in Jaipur were vandalized by protesters who alleged that the film shows a much-celebrated Rajput queen in poor light.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu