»   »  కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం 3.5 కోట్లా???: అసలు ఏం చేస్తున్నారు!!?

కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం 3.5 కోట్లా???: అసలు ఏం చేస్తున్నారు!!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూడున్నర కోట్లు దాదాపుగా టాలీవుడ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చే ఇండస్ట్రీలో కూడా ఒక చిన్న సినిమా బడ్జెట్. ఇదే బడ్జెట్ తో 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇక భోజ్ పురీ, మరాఠీ ఇండస్ట్రీలలో మూడుకోట్లంటే ఒక స్థాయి బడ్జెట్ అన్నట్టే. అయితే ఆ మూడున్నర కోట్లు కేవలం ప్రమోషన్ కోసమే ఖర్చుపెడితే?? బాలీవుడ్ సినిమా అంటే సరే ఆమాత్రం ఉంటుందనుకోవచ్చు కానీ కేవలం ఫస్ట్ లుక్ కోసమే కోట్లు దాటితే??? ఆశ్చర్యపోకండి మీరు చదువుతున్నది నిజమే...

ఈ చిత్రంలో షాహిద్ కపూర్, దీపిక పదుకొణే, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపిక ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోండగా, ఈమె భర్త రాజా రావల్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. రణవీర్ సింగ్ విలన్ గా అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్ లో కనిపించనున్నాడు.

 Sanjay Leela Bhansali Spent 3.5 Cr For Padmavathi First Look Poster

చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ నాలుగు రోజుల క్రితం క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేసింది. పద్మావతిగా రాజఠీవీతో కూడిన లుక్ లో దీపిక అదిరిపోయిందని అంటున్నారు. ఒంటి నిండా నగలతో లెహంగాని ధరించి అచ్చం పద్మావతి అవతారంలో దీపిక ఒదిగిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Ranveer Singh To Romance A Guy In Padmavati ఒక అబ్బాయితో రణవీర్ రొమాన్స్స్..

పలు చిత్రాలలో దీపిక రాయల్ లుక్ తో కనిపించినప్పటికి, పద్మావతి లుక్ మాత్రం జనాల మనసులని ఎంతగానో టచ్ చేసింది. త్వరలోనే షాహిద్ కపూర్ మరియు రణ్ వీర్ సింగ్ లుక్స్ కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే పద్మావతి ఫస్ట్ లుక్‌ను కోట్లు ఖర్చు పెట్టి డిజైన్ చేయించినట్టు సమాచారం. పద్మావతి ఫస్ట్ లుక్ కోసం ఏకంగా రూ.3.5కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Sanjay Leela bansali spent 3.5 crores just on the first day of Navratri. The film releases on the 1st December has been making headlines ever since the announcement of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu