»   » దీపిక అంగాంగ ప్రదర్శనపై సంజయ్ లీలా భన్సాలీ ఫైర్.. పద్మావతి కొంపముంచేస్తావా..

దీపిక అంగాంగ ప్రదర్శనపై సంజయ్ లీలా భన్సాలీ ఫైర్.. పద్మావతి కొంపముంచేస్తావా..

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే కెరీర్ టాప్ గేర్‌లో వెళ్తున్నది. బాక్సాఫీస్ వద్ద ఆమె నటించిన చిత్రాలు కనకవర్షం కురిపిస్తున్నాయి. హలీవుడ్‌లో కూడా ఆమె కెరీర్ గ్రేట్‌గా ప్రారంభమైంది. ఆమె నటించిన ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగా మంచి రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఎక్స్ 4‌లో కూడా దీపిక పదుకొనే నటిస్తుందని డైరెక్టర్ డీజే కారుసో ఇటీవల ప్రకటించడం హాలీవుడ్‌లో దీపిక హవా చెప్పకనే చెప్పింది.

వివాదాస్పదమైన దీపిక ఫొటోషూట్

వివాదాస్పదమైన దీపిక ఫొటోషూట్

బాలీవుడ్, హాలీవుడ్‌లో హవా కొనసాగుతున్న తరణంలో ఇటీవల దీపిక పదుకొనే చేసిన ఫొటోషూట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు ఇదేంటి ఇంత దిగజారుడుతనామా అంటే.. దీపిక గ్లామర్ అదుర్స్ అంటూ మరికొంత మంది పండుగ చేసుకొన్నారు. అయితే ఆమె ధరించిన దుస్తుల తీరు మాత్రం మీడియాలో వివాదాస్పదమైంది.

పద్మావతిపై ప్రతికూల ప్రభావం

పద్మావతిపై ప్రతికూల ప్రభావం

ఇదిలా ఉండగా, దీపిక తీరు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని మనస్తాపానికి గురిచేసిందట. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పద్మావతి చిత్రంపై దీపిక చేసిన ఫోటోషూట్ ప్రతికూల ప్రభావం పడుతుందా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారట. ఎందుకంటే పద్మావతి చిత్రంలో అత్యంత సాంప్రదాయరీతిలో సాగే పాత్ర దీపికది. అలాంటి నేపథ్యంలో అర్ధనగ్న దుస్తుల్లో దీపిక కనిపించడం వల్ల సినిమాపై ప్రభావం పడుతుందా అనే భయం ఆయనను వెంటాడుతున్నదట.

ఇప్పటికే వివాదంలో..

ఇప్పటికే వివాదంలో..

ఇప్పటికే పద్మావతి చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకున్నది. చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారనే ఆరోపణలు సంజయ్ లీలా భన్సాలీపై గుప్పిస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు రాజస్థాన్‌లో షూటింగ్ స్పాట్‌పై దాడి చేశారు. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కూడా గాయపర్చడం సంచలనం రేపింది.

మనస్తాపానికి గురైన భన్సాలీ

మనస్తాపానికి గురైన భన్సాలీ

ఇలాంటి వివాదాల నడుమ దీపిక తీరుపై సంజయ్ లీలా భన్సాలీ మనస్తాపానికి గురయ్యాడట. పద్మావతి చిత్రంలో రాణి పాత్రలో కనిపించే దీపిక అర్థనగ్నంగా కనిపిస్తే బాగుంటుందా అనే అభిప్రాయాన్ని సంజయ్ లీలా భన్సాలీ వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. అలాంటి ఫొటోల వల్ల ప్రజలు తప్పుగా ఆలోచించే ప్రమాదముందని, రాణి పాత్రలో ఉండే రాజసం దిగజారే ముప్పు ఉంటుందనే భయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు కథనంలో పేర్కొన్నారు.

భన్సాలీతో ఇది మూడోసారి

భన్సాలీతో ఇది మూడోసారి

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకొనే నటించడం ఇది మూడోసారి. గతంలో రామ్ లీలా, తదితర చిత్రాల్లో నటించింది. తాజాగా పద్మావతి చిత్రంలో రాణి పాత్రను పోషిస్తున్నది. రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

English summary
Media report suggest that, Deepika is essaying the role of a historical character, a Rani (queen) in Padmavati and to pose for steamy photoshoots right before the release of the film, is unacceptable to him (Sanjay Leela Bhansali). He feels the pictures could rub people the wrong way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu