ఔటాఫ్ ఫోకస్: హీరోయిన్ సంజన గల్రానీ హాట్ ఫోజులు
'బుజ్జిగాడు' మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ సంజన గల్రానీ టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైనప్పటికీ కన్నడ, మలయాళ చిత్రాల్లో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ నెట్టుకొస్తోంది.
సంజన తాజాగా ఔటాఫ్ ఫోకస్ అనే మేగజైన్ కోసం హాట్ హాట్‌గా అందాలు ఆరబోసింది. ఇప్పటి వరకు సంజన గ్లామరస్ పాత్రలపై ఎక్కువగా దృష్టిపెట్టలేదు. ఈ హాట్ ఫోటో షూట్ ద్వారా ఇకపై సినిమాల్లో ఆల్ట్రాగ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధమే అనే సంకేతాలు పంపింది.

గతేడాది విడుదలైన 'దండుపాళ్యం-2', 'దండుపాళ్యం-3' చిత్రాల్లో సంజన టాప్ లెస్‌గా నటించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మలయాళ చిత్రసీమపై ఫోకస్ పెట్టిన ఈ బెంగుళూరు బ్యూటీ మూడు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉంది.


Click it and Unblock the Notifications











