»   » సంక్రాంతి సినిమా పందెంలో గెలిచే హీరో ఎవరు..ఓడే జీరో ఎవరు

సంక్రాంతి సినిమా పందెంలో గెలిచే హీరో ఎవరు..ఓడే జీరో ఎవరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి సీజన్ కి హంగామా మొదలైంది. తెలుగు సినిమా పండుగగా పేరున్న ఆ రోజున 'పరమవీర చక్ర", 'గగనం", 'మిరపకాయ్‌", 'వాంటెడ్‌", కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలలో క్రేజీ ప్రాజెక్టుగా బాలకృష్ణ నటిస్తున్న 'పరమవీరచక్ర" కనిపిస్తుంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న 150వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండడం, మరో బొబ్బిలిపులి అని ప్రచారం కావటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక రీసెంట్‌గా 'డాన్‌ శీను"తో సక్సెస్‌ కొట్టిన రవితేజ 'మిరపకాయ్‌"తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం మినిమం గ్యారెంటీ చిత్రమని అంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తన కెరీర్ నిలబెట్టే చిత్రంగా మలుస్తున్నాడని, వినోదమే ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

వీటితర్వాత నాగార్జున ద్విభాషా చిత్రం 'గగనం" (తమిళంలో 'పయనం") క్రేజ్ ఉంది..'రగడ"తో డిసెంబర్‌ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగార్జున రెండుమూడు వారాల వ్యవధితో 'గగనం"తో మళ్లీ రానుండడం నాగ్‌ ఫ్యాన్స్‌కు చాలా హ్యాపీగా ఉంది. ఇక వీటితో పాట వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న గోపీచంద్ తాజా చిత్రం 'వాంటెడ్‌" కూడా ఆసక్తి రేపుతోంది. రచయిత నుంచి దర్శకుడుగా మారిన బి.వియస్ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మూడు పాటలు మినహా షూటింగ్‌ కార్యక్రమాలు మాత్రమే కాదు..డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.మరో ప్రక్క వీటిన్నట్టికి భిన్నంగా రామ్ గోపాల్ వర్మ..సునీల్ హీరోగా సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూర్తి కామిడీతో రూపొందే ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ రాబట్టుకుంటుందని అందరికి నమ్మకం ఉంది. ఇంతకీ వీళ్ళలో సంక్రాంతికి ఎవరు హీరోలుగా నిలబడుతారో..ఎవరు జీరోలు అవుతారో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu