»   » పవన్ కళ్యాణ్ సినిమాకి కమిడియన్ సప్తగిరి షాక్? ఇప్పుడేం చేస్తారు?

పవన్ కళ్యాణ్ సినిమాకి కమిడియన్ సప్తగిరి షాక్? ఇప్పుడేం చేస్తారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈటీవి పాపులర్ పోగ్రామ్ జబర్దస్త్' కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్ సప్తగిరి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సప్తగిరి, ఇప్పుడు పవన్ కు సమస్యగా మారాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అంటే డైరక్ట్ గా పనన్ ని ఏదో అనటమో , లేక పవన్ సినిమాలో రిజెక్ట్ చేయటమో కాదట. సప్తగిరి పవన్ లేటెస్ట్ గా డాలీ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' సినిమాకు సమస్యగా మారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు.

పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత అనేక ఆలోచనలు చేసి దర్శకులను మార్చి తీస్తున్న సినిమాకు అనేక చర్చలు చేసిన తరువాత ఆ సినిమాకు ఎట్టకేలకు 'కాటమరాయుడు' అన్న టైటిల్ ఫిక్స్ చేసి పవన్ పుట్టినరోజునాడు హడవిడిగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడ వదిలారు.

అలాగే పవన్ కు రికార్డులు తెచ్చి పెట్టిన 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ పాడిన 'కాటమరాయుడా' పాట గుర్తుకు వచ్చేలా ఈ కొత్త సినిమా టైటిల్ సెంటిమెంట్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ లుక్ హడావిడిగా డిజైన్ చేయడంతో చాలామంది పవన్ అభిమానులకు కూడ ఈ ఫస్ట్ లుక్ నచ్చలేదక్కన పెడితే ఈ టైటిల్ కు సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Sapatagiri debuts as hero with pawan's Katamrayudu

మీడియా నుంచి వస్తున్న వార్తల ప్రకారం కమెడియన్ సప్తగిరి హీరోగా చేస్తున్న మూవీకి ఇదే టైటిల్ ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసారు. ఇంతకు ముందు ఈ వార్త మీడియాలో కూడా వచ్చింది. మరి ఓ కమిడయన్ పెట్టుకున్న టైటిల్ ని అతని వద్దనుంచి లాగేసుకుంటారా లేక పవన్ వేరే టైటిల్ పెట్టుకుంటారా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

కానీ పవన్ సినిమా నిర్మాతలు అడిగితే సప్తగిరి తో 'కాటమరాయుడు' టైటిల్ తో సినిమాను తీస్తున్న నిర్మాతలు ఆ టైటిల్ ను పవన్ కు ఇచ్చివేయడం ఖాయమే అంటున్నారు. అయితే సప్తగిరి కోసం రిజిస్టర్ చేసిన టైటిల్ తో పవన్ నటించడం ఏమిటి అని పవన్ అభిమానులు తమ అయిష్టాన్ని వ్యక్తపరుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీనితో ఈ 'కాటమరాయుడు' టైటిల్ ను మార్చమని ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ పై పవన్ వీరాభిమానుల ఒత్తిడి పెరుగుతున్నట్లు వినిపిస్తోంది. కొద్ది కాలం క్రితమే చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు' టైటిల్ కూడ చిరంజీవి వీరాభిమానులకు పూర్తిగా నచ్చకపోవడంతో ఆ టైటిల్ ను మార్చమని రామ్ చరణ్ వివి వినాయక్ లపై మెగా స్టార్ అభిమానులు ఒత్తిడి చేస్తే 'ఖైదీ నెంబర్ 150' ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.

English summary
comedian Sapthagiri is also turning hero. He has already completed the most part of the shoot for his debut movie as hero. The film has been titled 'Katamrayudu', taking the title from Pawan Kalyan's song of 'Atharintiki Daaredi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu