»   » సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రెడీ

సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.దాదాపు మూడు నెలలకిపైగా హైదరాబాద్, పోలాండ్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తుందని యూనిట్ తెలిపింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ తెలిపారు. అలానే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు.


English summary
Tollywood crazy comedian Saptagiri's Saptagiri Express movie is in post production stage. shooting of the movie is completed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu