Don't Miss!
- News
`ఆ మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది`- మెగాస్టార్..!!
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సప్తగిరి ఎల్‌ఎల్‌బీ మరో రికార్డు.. ఫ్రాఫిట్ జోన్లోకి వస్తుందా?
Recommended Video

కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన రెండో చిత్రం సప్తగిరి ఎల్ఎల్‌బీ విడుదల తర్వాత మంచి రిపోర్టును సొంతం చేసుకొన్నది. సినీ విమర్శకులు, ప్రేక్షకులు సానుకూలంగా స్పందించారు. అయితే తొలి నాలుగు రోజుల కలెక్షన్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. కానీ వారాంతం తర్వాత పెద్దగా కలెక్షన్లు పెరిగిన దాఖలాలు లేవని తెలుస్తున్నది.

ఫస్ట్ డే కలెక్షన్లు
ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం.. తొలి రోజున ఈ చిత్రం ఏపీలో రూ.37 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే నిర్మాత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని ఆశించడంతో కొంత నిరాశపడినట్టు తెలుస్తున్నది.

నాలుగు రోజుల కలెక్షన్లు
గత నాలుగు రోజుల్లో సప్తగిరి ఎల్ఎల్‌బీ రూ.1.30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఆ తర్వాత కలెక్షన్లు సాధారణంగానే ఉన్నట్టు తెలుస్తున్నది.

ఫ్రాఫిట్ జోన్లోకి వస్తుందా?
సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా భారీ మొత్తంలో వసూలు చేయాల్సి ఉంటుందనే ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం. ఇదే టీమ్ రూపొందించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ మంచి లాభాలను సాధించింది. ఈ సినిమా కూడా ప్రాఫిట్ జోన్‌లొకి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

రికార్డు ధరకు
ఇదిలా ఉండగా, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టు సమాచారం. దాదాపు రూ.4.5 కోట్ల రేటుకు అమ్మినట్టు తెలుస్తున్నది. సప్తగిరి సినిమాకు ఈ రేంజ్‌లో ధర పలకడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.