For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశాల్ చేతిలో ఓటమి అనంతరం శరత్ కుమార్ కామెంట్!

By Bojja Kumar
|

హైదరాబాద్: తమిళ సినీ నటుల సమాఖ్య ‘నడిగర్ సంఘం' ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ముందు హోరా హోరీ విమర్శలతో ఎన్నికల వేడి రాజకీయవాతావరణాన్ని తలపించింది. ఒకానొక సమయంలో ఇరు వర్గాలు వ్యక్తిగత విమర్శలు... కుక్క, నక్క అంటూ నిందించుకోవడం చూసి సినీ ప్రేక్షకులు సైతం నివ్వెర పోయారు.

ఈ నెల 18న జరిగిన ఎన్నికల్లో శతర్ కుమార్ జట్టు..... నాజర్-విశాల్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఓటమి అనంతరం నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడిగా మారిపోయిన శరత్ కుమార్ మాట్లాుతూ...ఎన్నికల సందర్భంగా విశాల్ జట్టు తనపై చేసిన ఆరోపణలు, అవినీతి నిందలు తన మనసుని తీవ్రంగా గాయపరిచాయని, తాను పరిశుద్ధుడిని మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా 15 ఏళ్లు నడిగర్‌ సంఘం అభివృద్ధి కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డానని, 33 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఏనాడూ తప్పు చేయలేదని, నడిగర్‌ సంఘం వ్యవహారంలోనూ ఎ లాంటి తప్పు జరగలేదని స్పష్టం చేసారు.

Sarath kumar Press Meet: Agreement with SPI cinemas cancelled in Sept

నడిగర్‌ సంఘం ఎన్నిలకు ప్రధాన కారణమైన ఎస్‌పీఐ సినిమాస్‌తో ఒప్పందాన్ని ఎన్నికలకు ముందే రద్దు చేసినట్లు ప్రకటించారు. ఎస్‌పీఐతో సంప్రదింపులు జరిపి సెప్టెంబర్‌ 29వ తేదీన ఒప్పందం రద్దుపై నిర్ణయం తీసుకున్ననట్లు చెబుతూ అందుకు సంబంధించిన పత్రాలను చెన్నైలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల ముందే ఈ విషయాన్ని ప్రకటించి ఉంటే నిజంగానే తాను తప్పు చేశానని అందరూ భావించి ఉండేవారని, తమ తొలి విజయంగా పాండవర్‌ ప్రచారం చేసేదని, అందుకే ఈ విషయాన్ని ఇపుడు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.

10 రోజుల్లోపు సంఘం ఆడిట్‌ లెక్కలన్నీ నూతన కార్యవర్గానికి అప్పగిస్తానన్నారు. ఎస్‌పీఐతో ఒ ప్పందం అత్యుత్తమ ఆదాయ వనరుగా ఎప్ప టికీ తాను విశ్వసిస్తానని, ఈ విషయంలో కొత్త సభ్యులు పునరాలోచన చేయాలని సూచించా రు. ఏదేమైనా నాజర్‌, విశాల్‌, కార్తి నేతృత్వంలోని కొత్త కార్యవర్గం చేపట్టే చర్యలకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

English summary
The agreement with SPI cinemas cancelled was in September following many acquisitions surrounding the matter. Still I feel that the agreement was beneficial to the Nadigar Sangam. I did not reveal this information as opposition would have used it against us. They would have said it was our failure.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more