»   » శరత్ కుమార్ కూతురుతో అల్లరి నరేష్ రొమాన్స్!

శరత్ కుమార్ కూతురుతో అల్లరి నరేష్ రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ బ్యాచిలర్ అల్లరి నరేష్ తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో రొమాన్స్ చేయబోతున్నాడు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. శ్రీను వైట్ల వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన మచ్చా సాయికిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

ఎకె ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హీరోయిన్ వరలక్ష్మి మార్సల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటోంది. అల్లరి నరేష్ మార్కుకు కామెడీ, యాక్షన్ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది.

Varalakshmi to romance Allari Naresh

ప్రముఖ సినీ రచయిత గోపీ మోహన్ ఈచిత్రానికి రచనా సహకారం అందించనున్నారు. శ్రీధర్ సీపాన డైలాగ్స్ అందించనున్నారు. హైదరాబాద్‌తో పాటు మలేషియా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం అల్లరి నరేష్ రవి బాబు దర్శకత్వంలో లడ్డూ బాబు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఊబకాయంతో, దానికి సరిపడే మేక్ అప్ తో కనిపించనున్నాడు నరేష్. సన్నగా రివటలా ఉండే అల్లరి నరేష్ ఇలా కొత్తగా కనిపించడం ఇదే మొదటిసారి. ఈ లడ్డూ బాబు కాకుండా నరేష్ ఈ సత్తి బాబు దర్శకత్వంలో 'జంప్ జిలానీ' అనే కామిడీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

English summary

 Comedy hero Allari Naresh teaming with new director Machcha Saikishor. Saikishor Previously working as Sribu vytla's Co-director. Anil Sunkara produce this film. Popular Telugu and Tamil hero Sarath Kumar’s daughter Varalakshmi will debut into Telugu industry with this film romancing Allari Naresh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu