»   » అరెస్టంటూ రూమర్లు: సిపికి నటుడు శరవణన్ ఫిర్యాదు

అరెస్టంటూ రూమర్లు: సిపికి నటుడు శరవణన్ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తాను అరెస్టయినట్లు వాట్సప్‌లో జరిగిన ప్రచారం పట్ల తమిళ నటుడు శరవణన్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు కనపిస్తున్నారు. దీంతో దానిపై ఆయన బుధవారం ఉదయం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తంబిదురై, తాయ్ మనసు తదితర చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.

ప్రస్తుతం ఆయన వివిధ రకాల పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్, ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ఎపి పోలీసులు జరుపుతున్న గాలింపు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మగ్లింగ్ కేసులో నటుడు శరవణన్‌ను మగంళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు వాట్సాప్‌లో ప్రచారం జరిగింది.

 Saravanan compains to CP on rumours

దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన శరవణన్ బుధవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌ను కలిసి వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రచారం అసత్యమని ఆయన ఫిర్యాదు చేశారు.

తాను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానని, చెన్నైలో జరుగుతున్న షాపుకారపేట్టై అనే సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమా షూటింగులో పాల్గొంటున్నానని ఆయన మీడియాతో చెప్పారు. తనను పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తాను అన్నాడియంకె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలిపారు. వాట్సాప్‌లో జరుగుతున్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని తాను పోలీసు కమిషనర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

English summary
Tamil actor Saravanan complained about malicious compaign against him in whatsup.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu