»   » ఐశ్వర్యరాయ్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ (‘సరబ్జీత్’ ట్రైలర్)

ఐశ్వర్యరాయ్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ (‘సరబ్జీత్’ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజు క్రితం రిలీజైన 'జజ్బా' చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఐష్.....తాజా నటిస్తున్న 'సరబ్జీత్' చిత్రం మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు. తాజాగా 'సరబ్జీత్' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ముఖ్యంగా ఐష్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టి పడేసే విధంగా, ఎమోషనల్ గా ఉండబోతోంది. ఐష్ కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో చూడబోతున్నాం.

పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పూర్తి దేశీ అవతారంలో పంజాబి మహిళగా డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. బహుషా ఐశ్వర్యరాయ్ ని ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు ఏ సినిమాలోనూ చూసి ఉండరు.

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

సరబ్జీత్ ట్రైలర్

‘సరబ్జీత్' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది.

ఐష్, రణదీప్

ఐష్, రణదీప్

సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

దేశీ అవతార్

దేశీ అవతార్

ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పూర్తి దేశీ అవతారంలో పంజాబి మహిళగా డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు.

రణదీప్ హుడా

రణదీప్ హుడా

ఈ సినిమా కోసం రణదీప్ హుడా భారీగా బరువు తగ్గి ఇలా చిక్కి శల్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

రిలీజ్

రిలీజ్

మే 9, 2016లొ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Gulshan Kumar, Pooja Entertainment and Films Limited and Legend Studios present the trailer of the highly anticipated Sarbjit starring Aishwarya Rai Bachchan, Randeep Hooda, Richa Chadda and Darshan Kumaar directed by Omung Kumar. Produced by Vashu Bhagnani, Jackky Bhagnani, Deepshikha Deshmukh, Produced by Bhushan Kumar,Krishan Kumar,Sandeep Singh and Omung Kumar. Co-Produced by Ajay Kapoor, Priya Gupta, Vanita Omung Kumar and Rajessh Singh. Chief Marketing Head Vinod Bhanushali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu