»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బైక్ పోస్టర్ లీక్ (ఫోటో)

‘సర్దార్ గబ్బర్ సింగ్’ బైక్ పోస్టర్ లీక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ వాడుతుంటాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రాయల్ ఎన్ పీల్డ్ బైక్ కొన్ని మార్పులతో డిజైన్ చేసారు. తాజాగా ఆ బైకుకు సంబంధించిన పోస్టర్ లీకైంది. గబ్బర్స్ సింగ్ తన గన్స్ పెట్టుకునేందుకు వీలుగా ఈ బైక్‌లో మార్పలు చేసారు. ఎంతో స్టైలిష్ గా ఉన్న ఈ బైక్ చూసి అభిమానులు ముచ్చటపడుతున్నారు.

‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కోస్టార్స్ షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ ఎంజాయ్ చేస్తూ శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పటిక బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ స్వయంగా తీసిన సెల్పీని తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.


Sardaar Gabbar Singh Bike

‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రం లోకేషన్లు పరిశీలించేందుకు గుజరాత్ వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగులో పాల్గొంటున్నాడు. సనిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.


ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇక్కడ మరో రెండు రోజుల్లో షెడ్యూల్ ముగిస్తుంది. ఆ వెంటనే టీం అంతా కలిసి గుజరాత్ వెళ్లనున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

English summary
We all seen powerstar pawankalyan uses different kind of bikes in each of his movies.Recently in Sardaar GabbarSingh he used Royal Enfield Bike. Take a look at the below pic.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu