»   » పవన్ కళ్యాణ్ సినిమా బాధితుల నిరాహార దీక్ష ప్రారంభం!

పవన్ కళ్యాణ్ సినిమా బాధితుల నిరాహార దీక్ష ప్రారంభం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ద్వారా నష్టపోయిన పంపినీ దారులు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ సినిమా వల్ల కోట్లు నష్టపోయిన తమను కాటమరాయుడు రైట్స్ ఇవ్వడం ద్వారా ఆదుకుంటామని మాట ఇచ్చి...ఇపుడు మాట తప్పారని, తమకు తగిన న్యాయం చేయాలని కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ రోడ్డుపై టెంటు వేసుకుని దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ... సర్దార్ గబ్బర్ సినిమా ద్వారా తాను రూ. 2 కోట్లు నష్టపోయాను. నిర్మాత శరత్ మరార్, పవన్ కళ్యాణ్ గారి మేనేజర్ శ్రీనివాస్ తర్వాతి సినిమా రైట్స్ ఇప్పిస్తామని సంవత్సరం నుండి వెయిట్ చేయించారు. ఇపుడు మాట తప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు అని సంతప్ కుమార్ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ దిగి రావాలి, న్యాయం చేయాలి

పవన్ కళ్యాణ్ దిగి రావాలి, న్యాయం చేయాలి

ఈ విషయం గురించి ఫిల్మ్ చాంబర్ పెద్దలను కూడా సంప్రదించాం. అపుడు నిర్మాత శరత్ మరార్, పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ హీరో పవన్ కళ్యాన్ గారితో మాట్లాడి చెబుతామన్నారు. మళ్లీ మేము కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తే.... హీరో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వొద్దని చెప్పారని మాతో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అలా అంటారని మేము అనుకోవడం లేదు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి మా మీద అబద్దాలు చెప్పి మాకు న్యాయం జరుగకుండా చేస్తున్నారు. మాకు సినిమా ఇస్తామని మాట ఇచ్చారు. కళ్యాణ్ గారు దిగి రావాలి, మాకు సినిమా ఇవ్వాలని సంపత్ కుమార్ కోరారు.

నాయకుడిగా ప్రవర్తించాలి

నాయకుడిగా ప్రవర్తించాలి

కళ్యాణ్ గారు 2019లో ఎలక్షన్లలో నిలబడతామని చెప్పారు. ఆయన ఒక నాయకుడు. నాయకుడిగా ఆయన ప్రవర్తించాలి. మేము ఆయన సినిమా కొన్నాం. ఒక డిస్ట్రిబ్యూటర్ నష్టపోయినపుడు, ఇంత గొడవ జరుగుతున్నపుడు ఇద్దరిని పిలించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తాను. కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని సంపత్ కుమార్ తెలిపారు.

అపుడు హ్యాపీగా ఫీలయ్యాం

అపుడు హ్యాపీగా ఫీలయ్యాం

అపుడు సినిమాకు నష్టాలు వచ్చిన వెంటనే.... పవన్ కళ్యాణ్ స్పందించారు, తనను నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగిందని, వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసి నష్టపోయిన వారందరికీ సినిమాను ఇద్దామని సినిమా స్టార్ట్ చేసారు. ఆయన సినిమా(కాటమరాయుడు) మొదలు పెట్టగానే చాలా హ్యాపీగా పీలయ్యాం. నష్టపోయిన వారమంతా గత సంవత్సరం పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ ను కలిసాం. టచ్ లో ఉండమని చెప్పారు. సంవత్సరం వెటింగ్ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కలుద్దామన్నారని తెలిపారు....ఇపుడు మాత్రం వారి ప్రవర్తన వేరుగా ఉందని సంపత్ కుమార్ ఆరోపించారు

అన్యాయం చేసారు

అన్యాయం చేసారు

అపుడు సినిమాను మాకు ఇస్తామని చెప్పి... ఇపుడు సినిమాను వేరే వారికి ఇచ్చారు. ఈ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయిన మా పరిస్థితి ఏమిటి? అని సంపత్ కుమార్ ప్రశ్నించారు. ఈ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయింది నైజాం డిస్ట్రిబ్యూటర్ (8 కోట్ల నష్టం) , కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ గా నేను 2 కోట్లు నష్టపోయామని... అపుడు నష్టపోయిన మాకు సినిమా ఇవ్వకుండా వేరొకరికి సినిమా ఇవ్వడం అన్యాయమని సంపత్ కుమార్ చెప్పారు.

మమ్మల్ని పట్టించుకోవడం లేదు

మమ్మల్ని పట్టించుకోవడం లేదు

‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా అగ్రిమెంటు సమయంలో నాన్ రికవరబుల్ అనే అగ్రిమెంటులో మేము సంతకం పెట్టింది నిజమే. కానీ అపుడు పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాసరావు ఇది పవన్ కళ్యాణ్ సొంతబేనర్ లాంటిది, ఏదైనా తేడా వస్తే ఆయన ఆదుకుంటారు అని మమ్మల్ని కన్విన్స్ చేసి సంతకం పెట్టించారు. ఈరోస్ వాళ్లు ఎవరో మాకు తెలియక పోయినా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో సంతకం పెట్టి కొన్నాం. ఇపుడు వారు సినిమా మీరు మా వద్ద కొనలేదు, ఈరోస్ వారి వద్ద కొన్నారు.... మాకు సంబంధం లేదు అని మొహం చాటేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్, నిర్మాత శరత్ మరార్ మా ఫోన్లు ఎత్తడం లేదు, మేసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదని సంపత్ కుమార్ వాపోయారు.

పవన్ కళ్యాణ్ అభిమానులం

పవన్ కళ్యాణ్ అభిమానులం

మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. ఆయనపై నమ్మకంతో సినిమా కొన్నాం. ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే కొన్నాం. గతంలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాలు రూ. 3.75 కోట్లకు మించి బిజినెస్ చేయలేదు. పవన్ కళ్యాణ్ మేనేజర్ మాకు అపుడు భరోసా ఇచ్చి రూ. 4.5 కోట్లకు ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని కొనేలా చేసారు అన్నారు.

మా హీరోను అవమాన పరుచాలని కాదు

మా హీరోను అవమాన పరుచాలని కాదు

పవన్ కళ్యాణ్ ను కించపరుచాలనో, ఆయన్ను అవమాన పరుచాలనో ఇదంతా చేయడం లేదు. ఆయన కళామతల్లి ముద్దు బిడ్డ. ఆయనకు తెలియకుండా ఇదంతా జరుగుతోంది. మేము నష్టపోయిన విషయం, నష్టపోయిన మాకు సినిమా ఇవ్వలేదనే విషయం ఆయన వరకు చేరాలనే ఇదంతా చేస్తున్నామన్నారు.

English summary
Krishna Distributor Sampath Kumar started Hunger strike. Sampath Kumar acquired 'Sardaar Gabbar Singh' Krishna district rights for Rs 4.5 crore. In the full run, This Cop Drama recovered only Rs 2.58 crore Share and hence a loss to the tune of Rs 1.9 crore has been incurred by the Distributor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu