»   » ‘సర్దార్’ ఇంట్రడక్షన్ సీన్ ఇదేనా! (లీక్ ఫోటోస్)

‘సర్దార్’ ఇంట్రడక్షన్ సీన్ ఇదేనా! (లీక్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. షూటింగుకు సంబంధించిన ఫోటోస్ కొన్ని లీక్ అయ్యాయి. పవర్ స్టార్ ఇంట్రడక్షన్ ఖాకీ డ్రెస్సులో, ప్రత్యేకంగా డిజైన్ చేసిన సర్దార్ బైక్ మీద వస్తూ ఉంటుందని స్పష్టమవుతోంది. గబ్బర్ సింగ్ చిత్రంలో మాదిరి ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ ఎరుపురంగు తువ్వాలుతో కనిపించనున్నారు.

చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?


ఇంట్రడక్షన్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్స్ చాలా బావుందని, సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ హైలెట్ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా మొత్తం మీద కొన్ని అంశాలు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి 100 గుర్రాలు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసే సీన్.


పీక్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్ క్రేజ్... వెడ్డింగ్ కార్డుపై కూడా!


దీంతో పాటు పవన్ కళ్యాణ్, కాజల్ మధ్య పెళ్లి సన్నివేశం ఉంటుందని.... ఈ పెళ్లి ఘట్టం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతు సినిమాలకు హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. గతంలో ‘గబ్బర్ సింగ్' చిత్రంలో కూడా పవన్-శృతి హాసన్ పెళ్లి సీన్ హైలెట్ అయిన సంగతి తెలిసిందే.


స్లైడ్ షోలో ఫోటోస్...


ఆడియో

ఆడియో

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఏప్రిల్ లో

ఏప్రిల్ లో

ఏప్రిల్‌ 8న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.


ముఖ్య తారాగణం

ముఖ్య తారాగణం

పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంటే...శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మీ రాయ్ ఐటం సాంగుతో మెప్పించనుంది.


టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.English summary
Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh shooting is presently happening at Ramoji Film City where the production unit is canning introduction song on the hero and the dancers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu