»   » ఇచ్చిన మాట కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్

ఇచ్చిన మాట కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్'చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి అందిస్తామని మాటిచ్చాడు. ఈ మేరకు ఆయన క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నాడు.

ఇటీవల అన్నయ్య చిరంజీవిని కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో వేసుకున్న పోలీస్ డ్రెస్ లోనే వచ్చాడంటే ఆయన షూటింగులో ఎంత బిజీగా గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన పూర్తి సమయం షూటింగుకే కేటాయిస్తున్నారు. దీంతో ఆయన్ను కలిసేందుకు ఇటీవల ఏపీ మంత్రులు కూడా షూటింగ్ స్పాటుకు వెళ్లి రాజధాని అమరావతి శంఖుస్థాపన ఆహ్వాన అందించారు. ఆ సమయంలో ఆయన గబ్బర్ సింగ్ డ్రెస్సుతోనే మీడియాతో మాట్లాడారు.

Sardaar Gabbar Singh to join Sankranthi race

లాస్ట్ వీక్ వరకు హైదరాబాద్ లోనే జరిగిన ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ కు షిప్టయింది. గుజరాత్ లో దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ జరుగనుంది. గుజరాత్ లోని కచ్ ఏరియాలో కొన్ని ఫైట్ సీన్లతో పాటు, కీలకైమన సీన్లు చిత్రీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏరియాలో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లోనే జరుగాల్సి ఉంది. అయితే అక్కడ షూటింగ్ పర్మిషన్స్ విషయంలో లేట్ కావడంతో ఇపుడు షూటింగ్ ప్లాన్ చేసారు.

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్ ' లో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ కీ రోల్ పోషిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కూడా పోలీస్ అధికారిగా కనపించనున్నారని చెప్తున్నారు. ఆ మధ్యన సాయి ధరమ్ తేజ తనకు తన మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి నటించాలని ఉందని అన్నారు. ఇప్పుడు పవన్ తో ఆ కోరిక తీరుతుందని చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి సాయి ధరమ్ తేజ కు పవన్ కళ్యాణ్ అండగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Power Star Pawan Kalyan’s Sardaar Gabbar Singh teaser doubled the expectations on this movie. Now, everyone is eagerly waiting to watch this film. If the ongoing buzz is to be believed, it is heard that the makers are planning to join Sankranthi race and if everything goes as per the plan, Sardaar Gabbar Singh will hit the screens on January 14th.
Please Wait while comments are loading...