»   » సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త ప్రోమోలు...అదిరాయ్!

సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త ప్రోమోలు...అదిరాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార పర్వం ముమ్మరం అయింది. తాజాగా సినిమాకు సంబంధించిన రెండు కొత్త ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి కాజల్ కు పవన్ కళ్యాణ్ ముద్దు పెడుతున్న ప్రొమో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్లో సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటి వరకు మొత్తం 5 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. సినిమా ఏ రేంజిలో ఉండబోతోందో ఈ ప్రోమోలు చూస్తే స్పష్టమవుతోంది. మరో వైపు థియేట్రికల్ ట్రైలర్లోనే సినిమా స్టోరీ దాదాపుగా రివీల్ చేసారు.


పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అందే రేంజిలో ఉంటాయి. అందుకే సినిమాపై ఒత్తిడి తగ్గి ప్రేక్షుకులు సాధారణమైన అంచనాలనాలతోనే థియేటర్ కు రావాలనే ఉద్దేశ్యంతోనే ట్రైలర్లోనే స్టోరీ రివీల్ చేసినట్లు దర్శకుడు బాబీ వెల్లడించారు. పవన్ కళ్కాణ్ మార్కు ఎంటర్టెన్మెంటుతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటుందని తెలిపారు.


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని దాదాపు 50 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఓవరాల్ కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. సినిమాను అన్ని ఏరియాల బయ్యర్లు ఇప్పటికే భారీ ధరకు కొనుగోలు చేసారు. ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు.


స్లైడ్ షోలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన కొత్త ప్రోమోలు..


ప్రోమో 5

కాజల్ ను పవన్ కళ్యాణ్ ముద్దు పెడుతున్న ప్రోమో అదిరింది.


సర్దార్ గబ్బర్ సింగ్ ప్రోమో

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన కొత్త ప్రమోలు విడుదలయ్యాయి.


ప్రోమో-3

పవర్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ ఇతడే...


ప్రోమో-2

పవన్ కళ్యాణ్ గన్ను పట్టే స్టైల్ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్


పవన్ కళ్యాణ్

కామెడీ, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంటు ఇలా అన్ని వేరియేషన్స్ పవన్ కళ్యాణ్ చూపించబోతున్నారు.


English summary
Check out Sardaar Gabbar Singh latest promo. Starring Power Star Pawan Kalyan and Kajal Aggarwal in lead roles. Directed by KS Ravindra. Produced by Sharrath Marar and Sunil Lulla. Music composed by Devi Sri Prasad. Movie releasing 8th April World Wide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu