»   » గుజరాత్ వెళుతున్న పవన్ కళ్యాణ్ అండ్ టీం

గుజరాత్ వెళుతున్న పవన్ కళ్యాణ్ అండ్ టీం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. నెక్ట్స్ వీక్ సినిమా యూనిట్ అంతా గుజరాత్ షిప్టవుతోంది. అక్కడ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

గుజరాత్ లో దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ జరుగనుంది. గుజరాత్ లోని కచ్ ఏరియాలో కొన్ని ఫైట్ సీన్లతో పాటు, కీలకైమన సీన్లు చిత్రీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏరియాలో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లోనే జరుగాల్సి ఉంది. అయితే అక్కడ షూటింగ్ పర్మిషన్స్ విషయంలో లేట్ కావడంతో ఇపుడు షూటింగ్ ప్లాన్ చేసారు.

Sardaar Gabbar Singh shoot To Move To Gujarat

శనివారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.....ఏపీ కొత్త రాజధాని శంఖుస్థాపన సమయానికి గుజరాత్ నుండి విజయవాడ వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత.

ఇటీవల రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్లో పవన్ కళ్యాణ్, లక్ష్మీ రాయ్ లపై స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. పూర్తి వినోదాత్మకంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఉండబోతోంది. ఇంతకు ముందు వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ గా ఈచిత్రం ఉండబోతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండబోతున్నాయి.

English summary
Pawan Kalyan who is currently busy shooting for Sardaar Gabbar Singh in Hyderabad will be heading to Gujarat and stay there for almost 25 days.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu