»   »  ‘సర్దార్’ యాక్షన్ సీన్లు కూడా అదుర్సే (ఫోటోస్)

‘సర్దార్’ యాక్షన్ సీన్లు కూడా అదుర్సే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాలో పవన్ కళ్యాణ్ మార్కు ఎంటర్టెన్మెంటుతో పాటు హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు బోన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాయి.

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు చిత్రీకరించారని, సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అయ్యే విధంగా ఉందని యూనిట్ సభ్యులు తెలిపారు. సినిమాలో ఇంట్రడక్షన్ ఫీట్ సీన్ ప్రత్యేకంగా వేసిన గన్ ఫ్యాక్టరీ సెట్లో తీసారు. ఈ ఫైట్ సీన్ దాదాపు 10 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ సీన్లో 80 నుండి 100 మంది ఫైటర్స్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా అదిరిపోయే విధంగా ఉంటుందట.

ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర (బాబీ)దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పవన్ నటించి 'గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించడంతో మరోసారి ఆయన పోలీస్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రతన్‌పూర్ పోలీసుగా కనిపించబోతున్నారు. సంఘవిద్రోహ శక్తులకు, అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రతన్ పూర్ అంటే సామాన్యులతో పాటు పోలీసులు సైతం భయపడిపోతుంటారు. అలాంటి ఊర్లో పోలీసు ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఏం చేసాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథ.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిరిస్తున్నారు.

కాజల్

కాజల్

తొలిసారిగా కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

ముఖ్యపాత్రలు

ముఖ్యపాత్రలు

శరత్ ఖేల్కర్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు.

 టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: అర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, కళాదర్శకత్వం: బ్రహ్మ కడలి.

English summary
Pawan Kalyan's upcoming film Sardaar Gabbar Singh has high-octane action scenes that are expected to give bone-chilling experience. The film's fight episodes are very well-conceived - smartly written and meticulously executed, thus making Sardaar a good action film that action-lovers should look out for.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu