»   » హీరో,డైరక్టర్, హీరోయిన్ అంతా పవన్ ఫ్యాన్స్ ..కాబట్టే (వీడియో)

హీరో,డైరక్టర్, హీరోయిన్ అంతా పవన్ ఫ్యాన్స్ ..కాబట్టే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నితిన్ ...తొలి నుంచీ పవన్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ను అనుసరించడంతో ఓ అడుగు ముందుండే నితిన్...తాజాగా ఓ ఫీట్ చేసి పవన్ ఫ్యాన్ గా తానేంటో మరోసారి చెప్పి, అందరినీ ఆనందపరిచారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ లో పవన్ కల్యాణ్ ఎలా చెక్క గుర్రం మీద కూర్చుని ఆడుకున్నాడో అచ్చం అలాగే ఆడుకుంటూ 'ఆ...ఆ' సినిమా సెట్ లో సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ కు త్రివిక్రమ్ డైరక్ట్ చేయటం విశేషం.


మరో ప్రక్క నితిన్‌తో పాటు ఆ చెక్క గుర్రం మీద నితిన్ ను ఆడిస్తూ సినీ నటి సమంత 'లవ్యూ పవర్ స్టార్' అంటూ పవన్ కల్యాణ్ మీద ప్రేమను వ్యక్తం చేసింది. ఈ సందడిని వీడియో తీసిన నితిన్ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇప్పుడు ఆ వీడియో చూసిన అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు.


Look what just happened on our sets of A Aa.. choreographed by Samantha Ruth Prabhu and directed by Trivikram garu.. ☺ ☺ ☺


Posted by Nithiin on 26 March 2016

ఇక నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అ..ఆ' చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌లో సమంతతో కలిసి సరదాగా గడిపిన ఓ వీడియోను నితిన్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సమంత, దర్సకుడు త్రివిక్రమ్ కు పవన్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరూ కూడా గతంలో పవన్ తో పని చేసారు.


పవన్ తో నితిన్ కు అనుబంధం ఎలాంటిదంటే..


హీరో కావటానికి ప్రేరణ

హీరో కావటానికి ప్రేరణ

గతంలో నితిన్ మాట్లాడుతూ... నేను చిన్నప్పటి నుంచీ పవన్ కి వీరాభిమానని. తొలి ప్రేమ చిత్రం నేను హీరోని కావటానికి ప్రేరేపించింది.మొదటి నుంచీ

మొదటి నుంచీ

మొదటి నుంచీ నా చిత్రాల్లో పవన్ కళ్యాణ్ ఫొటోగాని, డైలాగు కానీ ఎక్కడో చోట పెడుతూ వస్తున్నాను అంటున్నారు నితిన్ఇప్పుడు గుర్తిస్తున్నారు...

ఇప్పుడు గుర్తిస్తున్నారు...

పవన్ మీద ఉన్న అభిమానంతో కూడిన ట్రెండ్ ని ఇష్క్ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాను. అయితే జనం, మీడియా పవన్ నా ఇష్క్ చిత్రం ఆడియో లాంచ్ కు వచ్చినప్పటినుంచీ గుర్తిస్తున్నారు అన్నారు నితిన్.


పవన్ ని మరిస్తే...

పవన్ ని మరిస్తే...

."నేను పది ఫ్లాపుల తర్వాత ఇష్క్ తో విజయం సాధించాను...నేను అప్పుడు పవన్ ని మరిస్తే...అదే జనం, మీడియా... నేను పవన్ ని మరిచిపోయానంటూ బ్లేమ్ చేస్తారు.వాడుకున్నానంటారు

వాడుకున్నానంటారు

అదే నేను అదే ట్రెండ్ ని కొనసాగిస్తూంటే... నేను ఆయన్ను వాడుకున్నానంటారు. కాబట్టి నేను అవేమీ పట్టించుకోకుండా నా మనస్సు ఏది చెప్తే అదే చేస్తున్నా..అదే ...ఆయన ఆరాధించటం ." అన్నారు నితిన్.


ఆఫర్ వస్తే..

ఆఫర్ వస్తే..

పవన్ కళ్యాణ్ తో పని చేసే అవకాశం వస్తే...ఎంత ఖర్చయినా దక్కించుకుంటాను. నా సినిమాలు అన్ని స్టాప్ చేసి ఆ సినిమాను నిర్మిస్తాను' అని నితిన్ వెల్లడించారు.వేసవిలో ...

వేసవిలో ...

పవన్ ... ప్రతి సంవత్సరం తన సన్నిహితులకు మామిడి పళ్లు పంపిస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని అయిన నితిన్ కూడా ప్రతీ సంవత్సరం కూడా ఆయన తోట నుండి వచ్చిన మామిడి పళ్లు అందుకుంటూంటారు.


క్యారక్టర్ పేరే

క్యారక్టర్ పేరే

కొరియర్ బాయ్ కల్యాణ్ చిత్రంలో నితిన్ పాత్రకు కళ్యాణ్ అని పెట్టడానికి కారణం పవన్ మీద ఉన్న అభిమానమే.ఫొటోని ..

ఫొటోని ..

'చిన్నదాన నీ కోసం' చిత్రం ఆడియో సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాన్, నితిన్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు. పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా... ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు.


టైటిల్ సైతం..

టైటిల్ సైతం..

'గబ్బర్ సింగ్' సినిమాలోని 'గుండెజారి గల్లంతయ్యిందే' పాటను టైటిల్ గా పెట్టుకుని హిట్ కొట్టాడు.రీమిక్స్ సైతం..

రీమిక్స్ సైతం..

'గుండెజారి గల్లంతయ్యిందే' లో 'తొలిప్రేమ' సినిమాలోని ఫాస్ట్ బీట్ గీతం 'ఏమైందో ఈ వేళ.. 'పాటను ఈ
సినిమాలో రీమిక్స్ కూడా చేశాడు.రైట్స్

రైట్స్

'అత్తారింటికి దారేది' సినిమా నైజాం ప్రాంతపు హక్కుల్ని భారీ రేటు ఇచ్చి తన సొంతం చేసుకుని, రూపాయకి,నాలుగు రూపాయలు సంపాదించాడు.‘చిన్నదాన నీకోసం'లో

‘చిన్నదాన నీకోసం'లో

సెకండాఫ్ లో వచ్చే కౌ బాయ్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ‘బద్రి' సినిమాలో ఏ చికితా సాంగ్ లో వచ్చే కొన్ని క్లిప్స్ ని వాడుకున్నారు. అవి సందర్భానికి బాగా సెట్ అయ్యాయి.అందుకే వాడా

అందుకే వాడా

నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో, అభిమానమో అందరికీ తెలిసిందే. ఆ అభిమానంతోనే ఆయన సినిమాకు సంబంధించిన ఫుటేజీని సినిమాలో వాడుతున్నాను అని నితిన్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.మరి అ..ఆ లో..

మరి అ..ఆ లో..

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అ...ఆ లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన నితిన్ తీసుకు వస్తారా..వస్తే ఎలాంటి సన్నివేశంలో పెడతారనేది ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.English summary
Nithin shared the video and he tweeted, "Look what just happened on our sets of A Aa.. choreographed by Samantha Ruth Prabhu and directed by Trivikram garu".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu