»   » పవన్ ఇంటర్వూ :వర్మ కు వార్నింగ్, పెళ్లిళ్లపై, 'సర్దార్' టాక్ పై, పాలిటిక్స్ పై..ఇంకా చాలా వాటిపై

పవన్ ఇంటర్వూ :వర్మ కు వార్నింగ్, పెళ్లిళ్లపై, 'సర్దార్' టాక్ పై, పాలిటిక్స్ పై..ఇంకా చాలా వాటిపై

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : 'క్రిటిక్స్ చేయాల్సిన పని వేరు. ఫిల్మ్ మేకర్ చేయాల్సిన పని వేరు. వర్మ తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కాదంటే, నాకూ లోపల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలను' అంటూ పవన్ గట్టిగానే రామ్ గోపాల్ వర్మని ఉద్దేసించి చెప్పారు.

  పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో పవన్ మాట్లాడారు. ఎన్నో విషయాలపై మొహమాటం లేకుండా స్పందించారు.


  తన సినిమా రిజల్ట్, కలెక్షన్స్ గురించి పట్టించుకోనంటూ...తన తదుపరి చిత్రం గురించి, రాజకీయాల గురించీ, తన వ్యక్తిత్వం, తన పిల్లల, పెళ్లిళ్ల గురించి, తనపై సెటైర్స్ వేస్తున్న వర్మ గురించీ పవన్‌ కల్యాణ్‌ ఇలా చెప్పుకొచ్చారు.


  ఈ ఇంటర్వూ చూస్తూంటే పవన్ చాలా ఫ్రాంక్ గా మాట్లాడారని అర్దమవుతుంది. కొన్ని విషయాలపై ఆయన స్పందన చూస్తూంటే ఓ భావకుడు మాట్లాడినట్లు ఉంటే మరికొన్ని విషయాలలో ఆయనలోని పరిశీలనా శక్తికి ఆశ్చర్యమేస్తుంది. సినిమాల కన్నా, ప్రపంచం, తన ఫ్యాన్స్ వంటివారిపై ఆయనకు ప్రేమ అధికం అనిపిస్తుంది. అలాంటివారిని ఎవరు ఇష్టపడకుండా ఉండారు..ఎవరు ప్రేమించకుండా ఉండగలరు.


  హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో పవన్‌కల్యాణ్ ఆఫీస్ లో ఈ ఇంటర్వూ జరిగింది. అక్కడ వాతావరణం పూర్తిగా సాహిత్యమయంగా ఉంది. వెయిటింగ్ హాలు దాటి ఆ డూప్లెక్స్ హౌస్‌లో లోపలికి వెళితే, ఒక చిన్న టేబుల్ మీద చాలా తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలు... ఆ పక్కనే పుస్తకాల బీరువా.


  పక్కనే ఉన్న చిన్నగదిలో బల్లపై విశ్వనాథ సత్యనారాయణ 'హాహా హూహూ', గుంటూరు శేషేంద్ర శర్మ 'ఆధునిక మహాభారతం', తిలక్ 'అమృతం కురిసిన రాత్రి', హిందీ, ఇంగ్లీష్ సాహిత్య రచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.సోఫాలో పవన్ కల్యాణ్. సర్దార్ నిర్మాత, సన్నిహితుడు అయిన శరత్‌మరార్‌తో మాట్లాడి, గ్యాప్ తీసుకుని ఇంటర్వూ ఇచ్చారు.


  స్లైడ్ షోలో ఇంటర్వూ చూడండి..


  ‘సర్దార్‌' ఫలితంపై సంతృప్తిగా ఉన్నారా?

  ‘సర్దార్‌' ఫలితంపై సంతృప్తిగా ఉన్నారా?

  అందరూ బాగుంది అంటున్నారు. నేనూ హ్యాపీనే. మేం ఎంత కష్టపడాలో అంత పడ్డాం. ఫలితం చెప్పాల్సింది ప్రేక్షకులే.  ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా?

  ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా?

  'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' నూటికి నూరు శాతం ఉంటుంది. దర్శకుడు ఎవరు? ఎప్పుడు? అన్నది చెప్పలేను.  ఏంటి? ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండానేనా?

  ఏంటి? ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండానేనా?

  రిజల్టంటే ఏమిటి? ఒక సిన్మాకు ఎంత డబ్బులు పెట్టాం, ఎంత వచ్చాయనేగా! మరీ, నా సినిమా రూ.400 కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టకండి! (నవ్వు) ఎండ్ టైటిల్స్‌లో చెప్పినట్లు 'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' చేస్తాం.


  'ఆగడు', 'కిక్2'లతో పోలుస్తూ, విమర్శలొచ్చాయే!

  'ఆగడు', 'కిక్2'లతో పోలుస్తూ, విమర్శలొచ్చాయే!

  'తొలిప్రేమ' సినిమా చేసినప్పుడు కూడా పనికి మాలిన ఆకతాయిల కథ అని విమర్శకులు చీల్చి చెండా డారు. కానీ, సిన్మా బ్లాక్ బస్టర్. ఇవాళ్టికీ చెప్పుకుంటున్నారు. అందర్నీ తృప్తిపరచడమనేది అసాధ్యం. ఏమైనా, ప్రశంసల్లానే విమర్శల్నీ తీసుకోవాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మెచ్చుకొనే వాళ్ళూ, తిట్టేవాళ్ళూ ఇద్దరూ నాకు సమానం.


  వర్మ ట్వీట్ పై..

  వర్మ ట్వీట్ పై..

  'బాహుబలి' తెలుగు సిన్మాను ఉన్నతశిఖరాలకు చేరిస్తే, 'సర్దార్...' మళ్ళీ కిందకు తీసుకుపోయిందన్నట్లు రామ్ గోపాల్‌వర్మ ట్వీట్ చేశారనే విషయంపై.... అలాగా! చూడలేదండీ! వీళ్ళంతా ప్రిడిక్టబుల్ పీపుల్.


   వర్మకూ, ఆయనకూ మధ్య ఏమైనా తేడా పాడాలున్నాయా?

  వర్మకూ, ఆయనకూ మధ్య ఏమైనా తేడా పాడాలున్నాయా?

  (క్షణమాగి) అప్పట్లో ఆయన 'వైఫ్ ఆఫ్ వరప్రసాద్' కథ చెప్పారు. ఆ సిన్మా నేను చేయలేదు. అంతే.


  అయినా ...

  అయినా ...

  వర్మ విచిత్ర మైన వ్యక్తి. నన్నడిగితే, ఆయన బయటవాళ్ళ మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్ళేవారు.  కామెంట్స్ పై

  కామెంట్స్ పై

  సిన్మా గురించైనా, పాలిటిక్స్ గురించైనా కామెంట్ చేయడం చాలా తేలిక. కానీ, పాలి టిక్స్‌లోకొచ్చి జనం ముందు మాట్లాడ్తే తెలుస్తుంది.


  వర్మని సెక్యూర్టీ లేకుండా..

  వర్మని సెక్యూర్టీ లేకుండా..

  అంతెందుకు ఆయన్ని (వర్మ) సెక్యూర్టీ లేకుండా విజయ వాడలో నుంచి వెళ్ళమనండి! కుదరదు. ఏమైనా, క్రిటిక్స్ చేయాల్సిన పని వేరు. ఫిల్మ్ మేకర్ చేయాల్సిన పని వేరు. ఆయన తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కాదంటే, నాకూ లోపల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలను.


  'గబ్బర్‌సింగ్' అలా పుట్టిందే..

  'గబ్బర్‌సింగ్' అలా పుట్టిందే..

  హైదరాబాద్‌లో కె.ఎస్.ఎన్. మూర్తి గారని పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనను గబ్బర్‌సింగ్ అని పిలిచేవారు. ఆ స్ఫూర్తితో నేను 'గబ్బర్‌సింగ్' అనే టైటిల్ పెట్టుకొని, హిందీ 'దబంగ్' బేసిక్ ప్లాట్ తీసుకొని, కథ, అంత్యాక్షరి సీన్స్ లాంటి వన్నీ వర్క్ చేశా. ఫోటో షూట్ చేశాక, దర్శకుడు హరీశ్ శంకర్‌ను పిలిచి, సిన్మా అప్పగించా. అలా 'గబ్బర్‌సింగ్' వచ్చింది.


  ఎంటర్టైనర్స్

  ఎంటర్టైనర్స్

  'గబ్బర్‌సింగ్' బ్రాండ్ కాదు కానీ దాన్తో ఎంటర్‌టైనర్స్ తీద్దామని!  అందుకే హిందీలో

  అందుకే హిందీలో

  'సర్దార్...'ను హిందీలో రిలీజ్ చేయడంలోని ఆలోచన? మన తెలుగు సినిమాల్ని హిందీలోకి డబ్బింగ్ చేసి, వాటిని 'జీ' టీవీ లాంటి వాటిలో విపరీతంగా ప్రదర్శిస్తున్నారు. జనమూ చూస్తున్నారు. అలాంటప్పుడు మన సిన్మాను మనమే హిందీలోకి డబ్ చేసి, రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా!  ఎవరో ఒకరు ..

  ఎవరో ఒకరు ..

  తెలుగు సిన్మా మార్కెట్‌ను విస్తరించడానికి ఎవరో ఒకరు ఇలాంటి ప్రయత్నం చేయాలి. 'సర్దార్ గబ్బర్ సింగ్'తో నేను చేసింది అదే! ఈ ప్రయత్నం సక్సెసా, కాదా అన్నది తర్వాత! ముందుగా ఎవరో ఒకరు ఇలాంటివి ప్రయత్నించాలి.  ప్రయత్నిస్తే..

  ప్రయత్నిస్తే..

  వంద సినిమాలతో ప్రయత్నిస్తే, 101వ దానితోనైనా తెలుగు సినిమాకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది.  కాకపోయినా ఫర్వాలేదు

  కాకపోయినా ఫర్వాలేదు

  బాలీవుడ్ కు వెళ్లింది నా సిన్మా అయినా, కాకపోయినా ఫరవాలేదు. కానీ, మన సినిమాకు మార్కెట్ పెరగడం ముఖ్యం. ఇది ఆ ప్రక్రియలో భాగం.   సినిమా విడుదలయ్యాక ఫలితం, వసూళ్ల గురించి

  సినిమా విడుదలయ్యాక ఫలితం, వసూళ్ల గురించి

  నేను నటుణ్ని. ట్రేడ్‌ ఎనలిస్ట్‌ని కాదు. నా పని నటించడం వరకే. ఎంత వసూలు చేసింది అనేది నిర్మాత, పంపిణీదారులు లెక్కలేసుకోవాలి.  ఎవర్నీ అడగను..

  ఎవర్నీ అడగను..

  నా సినిమా ఎలా ఉంది? అని ఎవర్నీ అడగను. ‘బాగుంది..' అన్నా. ‘బాగోలేదు' అని చెప్పినా ఒకటే స్పందన.  తల ఎగరేస్తే..

  తల ఎగరేస్తే..

  సినిమా బాగుందని తల ఎగరేస్తే.. రేపు ఫ్లాప్‌ వచ్చినప్పుడు ఆ తలే దించుకోవాల్సి వస్తుంది. రెండూ నాకు ఇష్టం ఉండదు.  ఏవి పట్టించుకోను

  ఏవి పట్టించుకోను

  నా సినిమాల గురించే కాదు. చుట్టుపక్కల సినిమాల విషయాలూ పట్టించుకోను.  మా అన్నయ్యే..

  మా అన్నయ్యే..

  ఈ మనస్తత్వానికీ కారణం మా అన్నయ్యే. ‘ఖైదీ' హిట్‌ అయ్యాక నా స్నేహితులు అన్నయ్య గురించి గొప్పగా మాట్లాడారు. ఆ తరవాత ఓ సినిమా ఆడలేదు. ఎగతాళి చేయడం మొదలెట్టారు. ఓ వ్యక్తిని అభిమానించినప్పుడు అలానే అభిమానించాలి. సినిమా సినిమాకీ ఆ స్థాయి మారకూడదు.


  పూరి సెటైర్ పై..

  పూరి సెటైర్ పై..

  గన్స్‌ లేకపోతే పవన్‌ కల్యాణ్‌ సినిమాలే చేయడు.. అంటుంటారంతా. పూరి జగన్నాథ్‌ ఓసారి గన్స్‌ విషయంలో మీపై సెటైర్‌ వేశారు.. అంటే... అది సరదాకి అన్నదే. చిన్నప్పుడు దీపావళి జరుపుకొనేటప్పటి నుంచీ గన్స్‌ ఇష్టం.


  వాటిని మధ్యలోనే వదిలేసా..

  వాటిని మధ్యలోనే వదిలేసా..

  ఇది వరకు నాణేల్ని, స్టాంపుల్నీ సేకరించేవాణ్ని. ఆ హాబీలు మధ్యలోనే వదిలేసినా. గన్స్‌పై మక్కువ పోవడం లేదు.  హిందీ పాటలంటే మక్కువ..

  హిందీ పాటలంటే మక్కువ..

  ‘ఖుషి'లో హిందీ పాట పెట్టారు.. ‘సర్దార్‌'లో హిందీ పాటలు వినిపించారు. హిందీ పాటలంటే అంత అభిమానం ఎందుకు అన్నదానికి సమాధానంగా...
  నాకు ప్రతి భాషా ఇష్టమే. రెండు సంస్కృతుల్ని కలిపే శక్తి కళకు ఉంది. కళాకారుల వ్యక్తిగత బాధ్యత అది.


  మన జాతీయ భాష

  మన జాతీయ భాష

  హిందీ పరాయి భాష కాదు. అది మన జాతీయ భాష. అలాంటప్పుడు సినిమాల్లో ఎందుకు టచ్‌ చేయకూడదు అనిపించింది.  నాన్న నుంచే..

  నాన్న నుంచే..

  నాకు జానపద గీతాలన్నా ఇష్టం. నా చిన్నప్పుడు నాన్న ఇంట్లో అలాంటి పాటలు వింటూ ఉండేవారు.


  అందుకే శ్రీకాకుళం పాటలు

  అందుకే శ్రీకాకుళం పాటలు

  నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు శ్రీకాకుళం జిల్లా వాళ్లు పరిచయమయ్యారు. వాళ్ల బాణీ నాకు నచ్చింది. ఏదైనా ఓ పాట, కథ బాగుంటే వీలు కుదిరినప్పుడు సినిమాల ద్వారా గుర్తు చేయడం మన బాధ్యత. ఆ కళ ఉనికిని కాపాడినవాళ్లమవుతాం.


  దర్సకుడుని ప్రక్కన పెట్టి..

  దర్సకుడుని ప్రక్కన పెట్టి..

  ‘దర్శకుణ్ని పక్కన పెట్టి పవనే సినిమా అంతా తీసుకొన్నాడు' అనే కామెంట్లు వినిపిస్తుంటాయి.. దర్శకుడు ఏం చెప్పినా సరే.. నాకు ఇష్టమైతేనే చేస్తా. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు  వాళ్లలా డాన్స్ చేయలేను..

  వాళ్లలా డాన్స్ చేయలేను..

  ‘ఎన్టీఆర్‌లానో, చరణ్‌లానో డ్యాన్స్‌ చేయండి' అంటే నా వల్ల ఏమవుతుంది. ‘నాకొచ్చే మూమెంట్స్‌ ఏడెనిమిది ఉంటాయి. వాటిలో నీకు ఏది నచ్చితే అది చేస్తా' అంటాను. అందుకే నేను ఇన్‌వాల్వ్‌ అవుతా .  నెక్స్‌ట్ సినిమా మళ్ళీ ఎప్పుడు?

  నెక్స్‌ట్ సినిమా మళ్ళీ ఎప్పుడు?

  త్వరలోనే! ఎస్.జె. సూర్య దర్శకుడు  మీ కాంబినేషన్‌లో 'ఖుషి'కి ఇది సీక్వెలా?

  మీ కాంబినేషన్‌లో 'ఖుషి'కి ఇది సీక్వెలా?

  లేదు. ఇది వేరే. ఫ్యాక్షనిస్ట్ లవ్‌స్టోరీ.  దాసరి నిర్మాణంలో సినిమా ఎప్పుడు?

  దాసరి నిర్మాణంలో సినిమా ఎప్పుడు?

  దాసరి అంటే నాకు గౌరవం. తెలుగు సినిమాకి ఎంతో చేశారు. అలాంటి వ్యక్తితో సినిమా అంటే నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. మంచి కథ దొరకాలి. ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు సినిమా చేస్తా.


  ‘సత్యాగ్రహి' సినిమా ఉంటుందా?

  ‘సత్యాగ్రహి' సినిమా ఉంటుందా?

  ‘సత్యాగ్రహి'లో ఏం చెప్పాలనుకొన్నానో.. అది ‘జనసేన' పార్టీ ఆవిర్భావంలోనే చెప్పేశా. సినిమాలో చెప్పడం కంటే బయట చేసి చూపించడం బాగుంటుంది అనిపించింది.  మీరు నిర్మాతగా

  మీరు నిర్మాతగా

  చరణ్‌తో, మీరు హీరోగా దాసరితో చేస్తామన్న సిన్మాల మాటేమిటి?


  అవి చేయాలండి! దాసరి గారు కథ సిద్ధం చేయిస్తున్నారు. కథ పూర్తి అయ్యాక తప్పకుండా చేస్తాం.   త్రివిక్రమ్‌తో 'కోబలి' చిత్రం చేస్తారన్నారు.

  త్రివిక్రమ్‌తో 'కోబలి' చిత్రం చేస్తారన్నారు.

  ఆ కథ గురించి, అది ఎప్పుడు పట్టాల మీదకు ఎక్కుతుందనేది త్రివిక్రమ్ గారు చెప్పాలి! మీరు ఆయన్ని అడగాలి (నవ్వులు).  నాకు వచ్చిందే చేస్తా..

  నాకు వచ్చిందే చేస్తా..

  చిరంజీవి తమ్ముడు.. డాన్సులు బాగా చేయాలనుకోవడం తప్పే. హీరో అంటే అన్నీ చేయాలనే అభిప్రాయానికి నేను వ్యతిరేకం. నాకొచ్చేదేదో నేను చేస్తా.  వీణ స్టెప్ గురించి..

  వీణ స్టెప్ గురించి..

  ‘ఇంద్ర'లో అన్నయ్య వీణ స్టెప్పు వేశారు. ‘సర్దార్‌...'లో నేనూ వేశా. అన్నయ్య నేలపై నుంచి స్టైల్‌గా పైకి లేస్తారు. నేనేదో అక్కడే నిలబడి.. నాకొచ్చింది చేశా. అది నా వీణ స్టెప్పు. ఏదో ఒకసారి డాన్స్‌ చేయమంటే చేస్తా. అదే ఫార్ములా అయిపోతేనే కష్టం.  గుర్రాలు తోలటానికి..

  గుర్రాలు తోలటానికి..

  సినిమాల్లోకి వెళ్తాను అనగానే నాగబాబు అన్నయ్య ‘కల్యాణ్‌కి హార్స్‌ రైడింగ్‌ నేర్పించండి' అన్నారు. అక్కడ మా నాన్న ఉన్నారు. ‘వీణ్ని గుర్రాలు తోలడానికి పంపిస్తున్నారా, నటించడానికి పంపిస్తున్నారా? ముందు నటించడం నేర్చుకో' అన్నారు.  నిజమే అనిపించింది..

  నిజమే అనిపించింది..

  ముందు నటించడం నేర్చుకో..నాన్న ఆ మాట అనగానే నిజమే అనిపించింది. నా పరిధిలో నేను కష్టపడి పనిచేస్తా. నాకు వచ్చిన దాన్ని సిన్సియర్‌గా చేస్తా. మిగిలినవాళ్లతో పోటీపడి నిరూపించుకోవాలనే ధ్యాస ఉండదు.


  రెండు మూడు చేసాక మానేస్తా..

  రెండు మూడు చేసాక మానేస్తా..

  నెల నెలా ఖర్చులు గడవడం కోసం సిన్మాలు చేయాల్సి వస్తోంది. కానీ, మరో రెండు, మూడు చేశాక మానేస్తా.


  మరి సిన్మాలు మానేస్తే ఎలా? ఫ్యాన్స్, ప్రేక్షకులేమవుతారు?

  మరి సిన్మాలు మానేస్తే ఎలా? ఫ్యాన్స్, ప్రేక్షకులేమవుతారు?

  'ఖుషి' టైమ్‌లోనే 2-3 సినిమాలు చేసి మానేద్దామ నుకున్నా. కుదరలేదు. ఇప్పుడిక పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకొంటున్నా. భార్యాబిడ్డల జీవితం గడవడానికి కావాల్సిన కొద్ది డబ్బు సంపాదించి, సిన్మాలు మానేస్తా. రాజకీయాల్లో నేను నాలా ఉండచ్చు. సిన్మాల్లో అలా కాదు.  తెలియకపోతే బాగుండేదనుకునేవాడ్ని

  తెలియకపోతే బాగుండేదనుకునేవాడ్ని

  నాకు ‘చిరంజీవి తమ్ముడు'లాంటి గుర్తింపులు ఇష్టం ఉండవు. ‘నేను చిరంజీవి తమ్ముణ్ని' అనే విషయం ఎవరికీ తెలియకపోతే బాగుండేదనుకొనేవాణ్ని.  రోజూ గొడవలు పెట్టుకోలేను

  రోజూ గొడవలు పెట్టుకోలేను

  చిరంజీవిని ఇష్టపడేవాళ్లే కాదు. ఇష్టపడనివాళ్లూ ఉంటారు కదా? వాళ్లతో నేను రోజూ గొడవలు పెట్టుకోలేను.


  సినిమా వేషాలు

  సినిమా వేషాలు

  నేను ఏదైనా తప్పు చేస్తే ‘ఏరా సినిమా వేషాలేస్తున్నావా' అనేవారు. నాకు ఆ పదం చిరాకు తెప్పించేది.  బ్రతకలేవురా..

  బ్రతకలేవురా..

  మా అన్నయ్య ‘నువ్వు మరీ సెన్సిటీవ్‌ అయిపోతున్నావ్‌... ఇలాగైతే బతకలేవురా' అనేవారు.  బ్రహ్మచారిగానే..

  బ్రహ్మచారిగానే..

  మా అమ్మ అంటుంటుంది. ‘ఒరేయ్‌ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకొన్నావ్‌. ఇన్ని పెళ్లిళ్లు చేసుకొన్నావ్‌..' అంటూ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది. జీవితమంటే అంతే. ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకొంటుందో చెప్పలేం.


  నా జీవితం కూడా.

  నా జీవితం కూడా.

  ఎలిజిబెత్‌ టేలర్‌ అన్ని పెళ్లిళ్లు చేసుకొందీ అంటే ‘అలా ఎలా చేసుకొంటారో' అనుకొనేవాణ్ని. నా జీవితం అలానే అయ్యింది.


  అకీరా చూసాడా

  అకీరా చూసాడా

  మా అబ్బాయి అకీరా ఈ సిన్మా చూడలేదు. నేను కూడా వాళ్ళను చూసి, 4 నెలలైంది. ఈ సినిమా బిజీలో పడి వెళ్ళలేదు. పిల్లలు బెంగ పడుతున్నారు.  సారి చెప్పా..

  సారి చెప్పా..

  ఈ సినిమా రిలీజ్ రోజునే వాడి పుట్టినరోజు కూడా! మర్చిపోయాను. సాయంత్రం గుర్తొచ్చి ఫోన్ చేసి, సారీ చెప్పాను. రేపో, ఎల్లుండో పుణే వెళ్ళి, చూసొస్తా.  నిజం కాదు..

  నిజం కాదు..

  'సర్దార్ గబ్బర్‌సింగ్'కు 35 కోట్లు తీసుకున్నారట! అది నిజం కాదు. అంత తీసుకోలేదు


  టాక్స్ వాళ్లని అడిగితే చెప్తారు..

  టాక్స్ వాళ్లని అడిగితే చెప్తారు..

  తెలుగులో అత్యధిక పారితోషికపు హీరో మీరేనంటే... యస్. అయామ్! హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకొంటున్నా. ట్యాక్స్ వాళ్ళనడిగితే చెబుతారు.


  English summary
  At the time Telugu Media is eagerly waiting for Pawan's press conference, but now he stunned them by offering appointment and gave exclusive interviews.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more