twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం రూ. 5 కోట్లతో సెట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గుజరాత్ షెడ్యూల్ పూర్తి కావడంతో నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.

    మార్చి నెలకి చిత్రీకరణ పూర్తి చేసి, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    Sardar Gabbar Singh set cost Rs.5 cr

    ఏ సినిమా బిజినెస్ అయినా కనీసం రిలీజ్ కు ముందు ఒక నెల నుండే ప్రారంబిస్తారు. కాని పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం సినిమా ప్రారంభం నుంచీ బిజినెస్ కోసం ట్రేడ్ వర్గాల్లో హడావిడి ప్రారంభమవుతుంది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కు అలాంటి పరిస్దితే ఉంది. ఈ సినిమా కోసం బయ్యర్లు వెంట పడుతున్నారు. కాని మొదటే ఈ సినిమా బిజినెస్ చేయకుండా క్రేజ్ వచ్చేదాకా ఆగారు. అయితే ఇటీవల..బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకోవాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ని లాక్ చేసి ట్రేడ్ వర్గాలకు తెలియచేసినట్లు తెలుస్తోంది. గాయత్రి ఫిల్మ్ వారు, ఉత్తరాంధ్ర కు సంబందించిన రైట్స్ ని ఇప్పటికే చాలా పెద్ద మొత్తం వెచ్చించి తీసుకున్నట్లు సమచారం.

    ఏప్రిల్ 8, 2016లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది.

    English summary
    Makers of Pawan Kalyan's 'Sardar Gabbar Singh' have created one of the costliest set ever for a Telugu film with over Rs 5 Crore expense.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X