Just In
- 3 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 4 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 5 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarileru Neekevvaru Pre Release Event : సరిలేరులో సూపర్ స్టార్ కృష్ణ.. : అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం.. పొద్దున్నే కొడుకు పుట్టాడు. సాయంతరం ఈ ఈవెంట్ మరిచిపోలేను. ట్రైలర్‌లో చెప్పినట్టే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్‌అనేలా ఉంటుంది సినిమా. స్టార్లన్నీ వచ్చి ఈ స్టేడియంలో రాలిపడ్డట్టు అనిపిస్తుంది. మెగాస్టార్, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ ఇలా అందరూ ఇక్కడే ఉన్నారు. మొదటగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు.
చిరంజీవి అని పేరు నలభై యేళ్లుగా వినబడుతూనే ఉంది. ఇంకా వినబడుతూనే ఉండాలి. మాట్లాడాలంటే ఏదోలా ఉంది. చిరంజీవి గారితో మొన్నే ఈ విషయంచెప్పాను. మనిషిలో ఓ కళ రావాలంటే ఏదో ఒక స్ఫూర్తి కావాలి. నాలో అలా వచ్చిన మొదటి ఆర్ట్ డ్యాన్స్. అది కూడా ఆయన పాటలు, సినిమాలు చూసి వచ్చినవే. చిన్నప్పుడు స్కూల్లో అబ్బని తియ్యని, లవ్‌లీ మై హీరో అనే పాటకు డ్యాన్సులు వేశాను. అప్పుడు నాకు బహుమతులు కూడా వచ్చాయి.

ఈ చిత్రంలో విజయశాంతి గారు సంక్రాంతి ముగ్గులా కొత్త రంగు వచ్చింది. ఈ సినిమాను ఒప్పుకున్నందుకు, పాత్రను చేసినందుకు థ్యాంక్స్. మహేష్ బాబు-విజయశాంతి గారి మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్‌లా అనిపిస్తాయి. ఈ చిత్రంలో నటించిన రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సంగీత, ఇలా అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో రీ రికార్డింగ్ అదిరిపోయింది. ఈ సినిమాలో మీకొక సస్పెన్స్ ఉంది. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. అదెలా ఉందో మీరే చూడండి.. దేవీ ఎలా చేశాడో కూడా చూడండ'ని అన్నారు.