Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarileru Neekevvaru Pre Release: అమ్మతోడు సినిమాలు తప్పా ఇంకేమీ చేయను.. బ్లేడ్ గణేష్ అని పిలవకండి
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

నిలువెత్తు నిదర్శనం..
బండ్ల గణేష్ మాట్లాడుతూ..‘మెగాస్టార్ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో ఎవరైనా, ఏ మనిషైనా, నేను, నా కొడుకు, నా వాళ్లు బాగుండాలని కోరుకుంటారు. అది సర్వసాధారణం. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఓ సూపర్ స్టార్ సినిమా బాగుండాలని, రికార్డులు క్రియేట్ చేయాలిన ఆశీర్వదించడానికి వచ్చిన మెగాస్టార్ సంస్కారానికి నా పాదాభివందనం.

అన్నదమ్ములుగా నటించాలి..
ఆయనకు వయసు 43..ఇంకా అరవై యేళ్లు వచ్చేవరకు నటించాలి. వారిద్దరు అలా కూర్చుంటే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మీరిద్దరు కలిసి అన్నదమ్ముల పాత్రను చేయండి. ఆయన మళ్లీ నటించాలని నేను మొక్కని దేవుడు లేడు. అయితే నన్ను మరిచి పోయాడు.. ఆయన కొడుక్కే సినిమాలు చేస్తున్నాడు.

250 కోట్లు కలెక్ట్ చేయాలి..
ఈ చిత్రం ఇండస్ట్రీలో నంబర్ వన్ అవుతుంది. అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఈ చిత్రాన్ని 250కోట్లు కొల్లగొట్టేలా తీశాడు. అన్ని రికార్డులు బద్దలు కొట్టాలి.. కొడుతుంది. ఇక్కడకు వచ్చిన మా అన్న, దైవం, మెగాస్టార్ చిరంజీవి గారికి పాదాభివందనం.

బ్లేడ్ గణేష్ అనొద్దు.. అమ్మతోడు..
ఇక నుంచి నన్ను బ్లేడ్ గణేష్ అనొద్దు.. బండ్ల గణేష్ అని పిలవండి. అందరూ యెర్రి డ్యాష్ అని పిలుస్తున్నారు.. కాబట్టి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను.. అమ్మతోడు ఇక సినిమాలు తప్పా ఇంకేమీ చేయను. ముప్పై యేళ్లు ఉన్నాను.. ఇంకో ముప్పై యేళ్లు ఇక్కడే ఉంటాను. అమ్మతోడు సినిమాలు తప్పా ఇంకేమీ చేయను. నాకు ఇంకేమీ సంబంధం లేదు. ఇంకా వేరే ఏ పని చేయన'ని చెప్పుకొచ్చాడు.