Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సరిలేరు నీకెవ్వరు' ఎఫెక్ట్.. ప్రజలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు
మహేష్ బాబు హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా శరవేగంగా ప్రమోషన్స్ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా నేడు (జనవరి 5) సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ పబ్లిక్ ఈవెంట్ మెగా, సూపర్ స్టార్ అభిమానులతో కిట కిటలాడనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి జనం పోటెత్తడం ఖాయం. ఈ మేరకు వాహనదారులు, ప్రజలపై పోలీసులు ఆంక్షలను విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు వైపు నుంచి వచ్చేవాహనాలను నాంపల్లివైపు మళ్లిస్తామని, అదేవిధంగా ఆబిడ్స్ నుంచి వచ్చే వాహనాలను గన్ ఫౌండ్రీ మీదుగా మళ్లిస్తామని, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనదారులు బషీర్ బాగ్ మీదుగా హిమాయత్ నగర్ వైపు వెళ్లాలని సూచించారు పోలీసులు.
కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను ఈడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తామని, లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తామని తెలిపారు. రవీంద్ర భారతి నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలని అన్నారు. ఈవెంట్‌కి వచ్చే అభిమానులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనాల రద్దీని తగ్గించాలనే ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.