Just In
- 52 min ago
అదిరిపోయిన అప్డేట్.. పవన్ కళ్యాణ్ కోసం కదిలి వచ్చిన త్రివిక్రమ్
- 1 hr ago
సంక్రాంతిని అలా ప్లాన్ చేశారన్నమాట.. అలీ రెజా-సోహెల్ రచ్చ
- 2 hrs ago
అలా చేస్తే అల్లుడు అదుర్స్ టికెట్స్ ఫ్రీ.. అందుకేనా అంటూ ట్రోల్స్
- 2 hrs ago
మరో హిస్టారికల్ బయోపిక్.. డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్న కాంట్రవర్సీ క్వీన్
Don't Miss!
- Sports
బ్రిస్బేన్‌లోనూ అదేకథ.. సిరాజ్‌పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు!!
- News
మమతా బెనర్జీకి మరో షాక్ తప్పదా?: 16న తేల్చేస్తామంటూ టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యే సోషల్ పోస్టులు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Finance
బ్యాంకులు, ఐటీ స్టాక్స్ దెబ్బ, భారీ నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్, హెచ్‌సీఎల్, టీసీఎస్ పతనం
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 11న చిరంజీవి నుంచి.. ఆయనే నాకు స్ఫూర్తి: మహేష్ బాబు కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.

మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లు
ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.
నిజంగా ఒక మిరాకిల్ డే అంటూ మహేష్ బాబు
ఈ సందర్బంగా వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా ఒక మిరాకిల్ డే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం లేవగానే అనిల్ రావిపూడి కొడుకు పుట్టాడని తెలియడం, మా దిల్ రాజు రెండోసారి గ్రాండ్ ఫాదర్ కావడం మిరాకిల్. మెగాస్టార్ చిరంజీవిగారు పిలవగానే మీరు వచ్చినందుకు స్పెషల్ థాంక్స్. సరిలేరు టీం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది.

నా ఒక్కడు సినిమా చూసి చిరంజీవి
చిరంజీవి గారు నా ఒక్కడు సినిమా చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడటం, అర్జున్ సినిమా సమయంలో సెట్ లోకి వచ్చి నాతో మాట్లాడటం.. ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మరువలేను. ఆయనే నాకు స్ఫూర్తి. నా సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ ఫోన్ కాల్ చిరంజీవి దగ్గరి నుంచే వస్తుంది. జనవరి 11న కూడా మీ నుంచే కాల్ రావాలని కోరుకుంటున్నా సార్.

అన్ని రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేసాం
విజయశాంతి గారు నన్ను ఎక్కువగా పొగిడేశారు. అప్పట్లో మీతో కొడుకు దిద్దిన కాపురం సినిమా చేశాను. అప్పుడేదైతే ఆమెలో డెడికేషన్ చూశానో ఇప్పుడు కూడా అదే చూశాను. మేము కాదు మీకు ఛాన్స్ ఇచ్చింది.. మీరు మాకు ఛాన్స్ ఇచ్చారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడితో పని చేసిన అన్ని రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేసాం అంటూ ఈ సందర్బంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు మహేష్ బాబు.