Just In
- 24 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 55 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా.. భయపడకండి.. రేపు జీవితం మీదే: విజయశాంతి పవర్‌ఫుల్ స్పీచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ
ఈ సందర్బంగా వేదికపై విజయశాంతి మాట్లాడుతూ.. వేదికమీదున్న అనిల్ రావిపూడి, దిల్ రాజు, మహేష్ బాబు, ప్రొడ్యూసర్స్, ఈ ప్రీ ఈవెంట్‌కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు.

1979 నుంచి.. లాంగ్ జర్నీ
1979 నుంచి 2020 వరకు లాంగ్ జర్నీ. మీ అందరితో కలిసి నడిచాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కామెడీ, యాక్షన్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మెగాస్టార్ తో చాలా సినిమాలు చేశా. మహిళలు దైర్యంగా ముందుకేయండి అని నా సినిమాలు తెలిపాయి.

నా అక్కచెల్లెళ్లకు చెబుతుంది ఒక్కటే..
ఈ వేదికనుంచి నా అక్కచెల్లెళ్లకు చెబుతుంది ఒక్కటే. భయపడకండి.. రేపు జీవితం మీదే. మహిళా శక్తులు మీరే. మీరు సాధించగలరు. మీ అందరి కోసం నేనున్నాను. నా ఊపిరి ఉన్నంతవరకు సినిమాలతో పాటు ఏ విధమైన పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
పట్టుకుంటే కంది పోతుంది.. ఆ మొహం చూస్తుంటే
ఇక లిటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆ మొహం చూస్తుంటే ఎంత క్యూట్ గా అమాయకంగా ఉంటుందంటే పట్టుకుంటే కంది పోతుంది అన్నట్టుగా ఉంటాడు ఆ బిడ్డ. అప్పుడు కృష్ణ గారు డైరెక్షన్ ఆయనతో యాక్ట్ చేశాను. మళ్ళీ ఆయనతో పని చేస్తానని నేను ఊహించలేదు. నా మొదటి హీరో కూడా కృష్ణ గారే. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

కృష్ణతో ఎంట్రీ.. మహేష్‌తో రీ ఎంట్రీ
కృష్ణ గారిని నా హీరో అని గర్వంగా చెప్పుకుంటాను. రీ ఎంట్రీ మహేష్‌తో ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. చెప్పాలంటే మహేష్ బాబు 24 కారెట్ బంగారం. సూపర్ స్టార్ అన్నదానికి అర్థం మహేష్ బాబు. జెంటిల్‌మెన్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు కామెడీ, డాన్స్‌తో ఇరగదీశాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని నేను అనుకుంటున్నా అని చెప్పింది విజయశాంతి.

చిరంజీవి గురించి మాట్లాడుతూ..
చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాలు చేసాం. ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చాము. పాతవన్నీ మాకు గుర్తొస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాను దీవించడానికి చిరంజీవి గారు వచ్చారు. థాంక్యూ మెగాస్టార్ అనేసింది విజయశాంతి.

చివరగా అందరికీ కృతజ్ఞతలు చెబుతూ
ఈ సందర్బంగా అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సినిమాకు పనిచేసిన అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి తన ప్రసంగాన్ని ముగించింది విజయశాంతి.